
సినిమాకి ఉన్న కెపాసిటీ తెలియచేస్తూ ఇళయదళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంలో రాయల్టీగా కూర్చున్న విషయం తెలిసిందే. దీంతో స్వపక్షం, ప్రతిపక్షం వల్ల సోషల్ మీడియాలో నిత్యం విజయ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజా న్యూస్ విజయ్ ఓల్డ్ న్యూస్ అన్నింటిని పక్కకి నెట్టేసి మై హునా అంటుంది.
Also Read: Rambha Oorvasi Menaka Movie Review: రంభ, ఊర్వశి, మేనక మూవీ రివ్యూ
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత విజయ్ ఫస్ట్ టైం ఈ నెల 10 న విదేశీ ప్రయాణం చేస్తున్నాడు. బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో ల్యాండ్ అవ్వబోతున్నాడు. పెట్టుబడులు తెచ్చేందుకే మా సార్ వెళ్తున్నారు అంటూ అభిమానులు, పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినపడుతుంది. విజయ్ వైఫ్ సంగీత మొన్న ఆగస్టులో కోర్టుకెళ్లి సైలెంట్‌గా విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుంది. ఆ కేసు క్లోజ్ అయి నెల రోజులు కూడా గడవక ముందే విజయ్ లండన్ వెళ్తున్నాడు. ప్రస్తుతం సంగీత లండన్‌లోనే సెటిల్ అయ్యింది. కాబట్టి ఈ టూర్ వెనుక అసలు స్క్రిప్ట్ ‘పెట్టుబడులు’ కాదని, భార్యామణిని కలవడానికి అనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
[ Vijay, Sangeetha, Tollywood, TeluguCinema, TeluguCinema News, Tollywood News]






