Home

»

Latest News

ఫస్ట్ డే తెలుగులో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబడతాడా.. ముఖ్యంగా ఆ సినిమాని క్రాస్ చేస్తాడా! 

Jul 22, 2026 12:35PM

 


ఇళయదళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో సునామి 'జననాయగన్' రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో ల్యాండ్ కానుంది. తమిళనాడులో బెనిఫిట్ షోస్ పడనుండటంతో విజయ్ అభిమానుల కోలాహలం మాములుగా లేదు. ఇక తెలుగులో జన నాయకుడుగా రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు రేపు అత్యధిక థియేటర్స్ లో షోస్ ప్రదరిస్తున్నాడు. 

 ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందా లేదా అనే చర్చ అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. తెలుగులో విజయ్ కి ఉన్న మార్కెట్ గత ఐదేళ్లలో ఊహించని రీతిలో పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల ఓపెనింగ్స్ విషయానికొస్తే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల పేరు మీద కొన్ని రికార్డులు ఉన్నాయి. రజనీకాంత్  చిత్రాలు తెలుగులో మొదటి రోజు 12 కోట్ల నుండి 15 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి. విజయ్ గత చిత్రం తెలుగులో మొదటి రోజు దాదాపు 8.5 కోట్ల షేర్ రాబట్టి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇప్పుడు 'జననాయకుడు' పై ఉన్న అంచనాల ప్రకారం, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే తెలుగు బాక్సాఫీస్ వద్ద తొలిరోజే 10 కోట్ల నుండి 12 కోట్ల మార్కును దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


Also read: హెల్త్ పై అమితాబ్ అర్జంట్ ట్వీట్... అభిమానులు టెన్షన్ పడద్దు


 విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న ఆఖరి సినిమా కావడం వల్ల అభిమానుల హంగామా, క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. శనివారం, ఆదివారం వీకెండ్ అడ్వాంటేజ్ కూడా తోడైతే తెలుగులో నాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమాల రికార్డులన్నింటి తో పాటు తన గత చిత్రం రికార్డుని 'జననాయకుడు' తిరగ రాయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన మునుపటి చిత్రాలు విజయవంతమవ్వడంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ ధరకు హక్కులని  కొనుగోలు చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య  బ్లాక్ బస్టర్ హిట్ 'భగవంత్ కేసరి' కి రీమేక్ గా రూపుదిద్దుకుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, తెలుగులో దీనికి దాదాపు 1,200 కంటే ఎక్కువ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ఇస్తున్నారు.   

Thalapathy Vijay, jananayakudu, jananayagan, pooja hegde
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com