
పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’, ‘మహావతార్ నరసింహ’ వంటి విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న యానిమేషన్ సినిమాను ప్రకటించింది. అదే ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’.
హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇస్కాన్ (ISKCON) వ్యవస్థాపక ఆచార్యులు ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్‌తో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మొదలైంది.
శ్రీల ప్రభుపాదుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని ఈ సినిమా ప్రధానంగా చూపించనుంది. 1965లో తన 69వ ఏట ఆయన భారతదేశం నుంచి అమెరికాకు ప్రయాణమయ్యారు. భగవద్గీత బోధనలు, శ్రీకృష్ణుడి సందేశాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ ప్రయాణం ప్రారంభించారు.

తన ఆధ్యాత్మిక గురువు శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూర్ ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి ఆయన చేపట్టిన ఈ ప్రయాణం.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్య సందేశాన్ని వ్యాప్తి చేసే ఉద్యమంగా మారింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని పరిచయం చేసిన ఆయన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ‘శరణాగతి’లో చూపించనున్నారు.
ఇది కూడా చదవండి: 30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఏఐ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. సాధారణ యానిమేషన్‌కు భిన్నంగా మనుషుల నిజమైన కదలికలు, హావభావాలు, శరీర భంగిమలను కెమెరాల ద్వారా రికార్డ్ చేసి.. వాటిని డిజిటల్ పాత్రలకు అనుసంధానిస్తారు. దీంతో యానిమేషన్ పాత్రల్లో సహజమైన కదలికలు, భావోద్వేగాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
అంటే ఆధ్యాత్మిక కథను ఆధునిక సాంకేతికతతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా తెరకెక్కించాలన్నది చిత్రబృందం ప్రయత్నం. టీజర్లో కనిపించిన విజువల్స్ కూడా ఈ టెక్నాలజీపై ఆసక్తిని పెంచుతున్నాయి.
‘శరణాగతి’ చిత్రానికి గౌర శక్తి దాస రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డైవ్ డీప్ ఏఐ స్టూడియోతో కలిసి ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సమర్పించి, పంపిణీ చేయనుంది. 2027 ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది.
మీకు నచ్చవచ్చు:
చరిత్ర సృష్టించిన ‘వారణాసి’.. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని డీల్.!
23 ఏళ్ళ క్రితం జరిగింది ఇదే.. పవన్ కళ్యాణ్ వదులుకున్న తమిళ అమ్మాయి.!
[Hombale Films Announces Saranagati, Saranagati Title Teaser, AC Bhaktivedanta Swami Prabhupada, ISKCON Founder, Srila Prabhupada Biopic, Hombale Films, Saranagati Movie, ISKCON]






