
వరల్డ్ వైడ్ గా ఈ నెల 25 న విడుదలైన హాలీవుడ్ మూవీ 'హాట్ ఆఫ్ ది బీస్ట్'. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి సిటీస్ లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకులని భావోద్వేగానికి గురి చేస్తోంది. కేవలం 1 గంట 45 నిమిషాల నిడివితో రూపొందిన ఈ చిత్రం, అలస్కాలోని ప్రమాదకరమైన అడవుల్లో విమాన ప్రమాదానికి గురైన ఒక మాజీ నావీ సీల్, అతని రిటైర్డ్ మిలిటరీ వర్కింగ్ డాగ్ 'ఓడిన్' survival కోసం చేసిన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.
ఇక ఈ సినిమా చూసిన మన ప్రేక్షకులకి మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం స్పష్టంగా గుర్తుకువస్తోంది. భారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన అనంతరం రాజ్యత్యాగం చేసిన పాండవులు, ద్రౌపది స్వర్గారోహణం కోసం హిమాలయాల వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఆ కఠినమైన ప్రయాణంలో ఒక విశ్వాసపాత్రమైన కుక్క వారిని అనుసరించడం మొదలుపెడుతుంది. మంచు తుఫాన్లు, తీవ్రమైన చలికి తట్టుకోలేక ద్రౌపదితో సహా నలుగురు సోదరులు ఒక్కొక్కరుగా పడిపోయి ప్రాణాలు విడుస్తారు.
ఆ క్రమంలో ధర్మరాజు మాత్రమే ముందుకు సాగుతాడు. కుక్క కూడా చివరివరకు అడుగడుగునా తోడుగా నడుస్తుంది. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన దివ్య రథంతో వచ్చి ధర్మరాజును సశరీరంగా స్వర్గానికి ఆహ్వానించినప్పుడు, ధర్మరాజు తనతో వచ్చిన కుక్కను కూడా రథంలోకి ఎక్కించుకోవాలని కోరతాడు. అయితే, "స్వర్గంలోకి కుక్కలకి అనుమతి లేదు, దానిని ఇక్కడే వదిలేసి రా" అని ఇంద్రుడు స్పష్టం చేస్తాడు. తనను నమ్మి అడవులు, కొండలు దాటి వచ్చిన ఆ ప్రాణిని ఆపద సమయంలో ఒంటరిగా వదిలేయడం అధర్మమని, దానికోసం స్వర్గ సుఖాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధమని ధర్మరాజు తెగేసి చెబుతాడు. ధర్మరాజు యొక్క ఈ నిస్వార్థ ప్రేమను, ధర్మ నిష్ఠను చూసి ఆ కుక్క రూపంలో ఉన్న ధర్మదేవుడు (యమధర్మరాజు) ప్రత్యక్షమై తన కొడుకైన ధర్మరాజుని ఆశీర్వదిస్తాడు. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆధ్యాత్మిక ధర్మాన్నే 'హాట్ ఆఫ్ ది బీస్ట్' సినిమా ఆధునిక కోణంలో అత్యంత భావోద్వేగంగా ఆవిష్కరించింది.

అలస్కాలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత (-20°C) ఉండే మంచు కొండలలో, ఎలాంటి ఆహారం లేకుండా మరియు భయంకరమైన వన్యప్రాణుల దాడి మధ్య 100 మైళ్ళకు పైగా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించే క్రమంలో కథానాయకుడు ప్రాణాపాయంలో పడతాడు. అటువంటి సమయంలో ప్రతిఫలం ఆశించని ఆ మిలిటరీ కుక్క చూపించిన విశ్వాసం, కథానాయకుడు కూడా దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి నిలబడే తీరు ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆధునిక యుగంలో కూడా మనుషుల మధ్య తగ్గుతున్న బంధాలకి ఈ కుక్క మనిషి అనుబంధం ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తోంది. మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి కట్టుబడి నిలిచినట్లే, ఈ సినిమాలో హీరో కూడా విశ్వాసానికి ప్రతీకగా నిలవడం వల్లనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 90% పైగా రేటింగ్‌తో సంచలనం సృష్టిస్తోంది. మరి చూడని వాళ్ళు తప్పక చూడండి. ఎన్నో సత్యాలని మన కళ్ళ ముందు ఉంచుతుంది. మిలిటరీ ఆఫీసర్ జేమ్స్ గా అగ్ర నటుడు బ్రాడ్ పిట్ అత్యద్భుతంగా పోషించాడు. డేవిడ్ అయ్యర్ దర్శకుడు.
[Heart Of The Beast Movie Story Telugu,Heart of the Beast movie Review, Dharmaraju and Dog story,Mahabharata Swargarohana, Brad Pitt survival movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






