Home

»

Latest News

ఈ డేట్ కి పవన్ కళ్యాణ్ పండుగని జరిపించాలని నిర్ణయం..ఆదేశాలు జారీ 

May 16, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hari Hara veeramallu).ఫస్ట్ టైం పవన్ చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడం, పైగా పోరాట యోధుడుగా కనిపిస్తుండటంతో, ఎప్పుడెప్పుడు వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుందా అని  ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తు వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి పోస్ట్ పోన్ చెయ్యడంతో వాళ్ళల్లో ఒకింత నిరుత్సాహం కూడా ఏర్పడింది.


ఇప్పుడు వాళ్ల నిరుత్సాహాన్ని పోగొట్టడానికి వీరమల్లు జూన్ 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు రీసెంట్ గా చిత్ర యూనిట్  అధికార ప్రకటన  చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ లోసరికొత్త జోష్ వచ్చినట్లయింది. పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా చేస్తుండగా, మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు క్యారక్టర్ ని బాబీడియోల్ పోషిస్తున్నాడు. మిగతా ఇతర పాత్రల్లో సత్యరాజ్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, జిష్ణుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, నాజర్, సచిన్ కెడ్కర్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
 

పవన్ కి  ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన మెగా ప్రొడ్యూసర్ ఏఎంరత్నం వీరమల్లుని అత్యంత భారీ వ్యయంతో  నిర్మించాడు. క్రిష్(Krish)జ్యోతికృష్ణ(Jyothi Krishna) ద్వయం దర్శకత్వం వహించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, సాంగ్స్  హైలెట్ గా నిలిచాయి.ట్రైలర్ కూడా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. సుమారు 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు.

 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com