Home

»

Latest News

హనుమాన్ అంశ చిత్రానికి పన్ను మినహాయింపు: మన ముఖ్యమంత్రిపై ప్రశంసలు 

Sep 5, 2026 6:59PM


కంటెంట్ ని నమ్ముకొని మూవీ తెరకెక్కిస్తే 'కరోడ్ పతి' అవ్వడంతో పాటు కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారని నిరూపించిన మూవీ "హనుమాన్ అంశ'. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్, సెల్యులాయిడ్ వద్ద  సంచలనాలు సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక సత్యంతో కూడిన పకడ్బందీ స్క్రిప్ట్   నిష్కల్మషమైన భక్తి ముందర కోట్లాది రూపాయల బడ్జెట్లు కూడా చిన్నబోతాయనే సత్యాన్ని కూడా బలంగా చాటి చెప్పిందని చెప్పవచ్చు.

ఇప్పుడు ఈ మూవీకి అనూహ్య గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ అద్భుత ఆధ్యాత్మిక కావ్యానికి రాష్ట్రవ్యాప్తంగా పన్ను మినహాయింపు (ట్యాక్స్ ఫ్రీ) ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  డెహ్రాడూన్‌లోని ఒక ప్రముఖ సినిమా హాళ్లలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన ధర్మపత్ని గీతా ధామీతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు గణేష్ జోషి, ప్రదీప్ బాత్రా మరియు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. సినిమా చూసిన అనంతరం పరవశించిపోయిన ముఖ్యమంత్రి, బాబా నీమ్ కరోలీ మహారాజ్ జీ త్యాగం, సేవా నిరతి, హనుమంతుడిపై ఆయనకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలని కళ్లకు కట్టినట్లు చూపించింది. భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, అదొక సేవ మరియు మానవాళి సంక్షేమానికి ఆత్మసమర్పణ అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా అందిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేవభూమి ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని దేశ విదేశాలకు చాటిచెప్పడంలో 'హనుమాన్ అంశ' వంటి సినిమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ధామీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు కైంచి ధామ్ ఒక పవిత్రమైన శ్రద్ధా కేంద్రంగా మారిన వేళ, ఈ నిర్ణయం భక్తులకు ఎంతో ప్రాధాన్యమైనదిగా నిలిచింది.

 

 


Also Read: వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి: పూనమ్ పాండే సంచలన కామెంట్స్


విశాల్ చతుర్వేది దర్శకత్వంలో కేవలం 1.75 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల అత్యంత స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కగా, ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైనప్పుడు ఎటువంటి ఆర్బాటాలు లేవు. తొలి రెండు వారాల్లో బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగి  మౌత్ టాక్ ముందు ఎన్ని పబ్లిసిటీ జిమ్మికులైనా జూజిబీ అని నిరూపించింది. ఈ విషయం భారతీయ సినిమా పుట్టుక నుంచి నిరూపితమవుతూ వస్తుంది. అందుకే  100 కోట్లకి  చేరువలో ఉంది.

 

 

[Hanuman Ansh, Tax Free, Neem Karoli Baba Biopic, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com