Home

»

Latest News

Gv Prakash kumar: రాజకీయాల్లోకి సంగీత దర్శకుడు జి వి ప్రకాశ్ కుమార్.. ఆ పార్టీలోకి అంటూ సంచలన వ్యాఖ్యలు

Jun 16, 2026 12:58PM


స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా ,హీరోగా సత్తా చాటుతూ ఫుల్ బిజీ మోడ్ లో ఉన్నాడు జి.వి. ప్రకాశ్ కుమార్(Gv Prakash kumar). రీసెంట్ గా  రాజకీయ రంగ ప్రవేశంపై జీవి చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర సంచలనం రేపుతున్నాయి.


ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ప్రకాష్ కుమార్ మాట్లాడుతు నా సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేను. ఆ తర్వాత నా పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయిస్తాను. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవుల కోసం కాదు. ప్రజలకి నిజాయితీగా సేవ చేయడమే నా ఉద్దేశ్యం.భవిష్యత్తులో నా వ్యక్తిగత ఆలోచనలు,  ఆశయాలకి  ఖచ్చితంగా సరిపోయే ఒక సరైన వేదిక దొరికితే, కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగస్వాములు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కీలక వ్యాఖ్యలతో భవిష్యత్తులో  పాలిటిక్స్‌లోకి రావడం 100 శాతం ఖాయమని బలమైన సంకేతాలు ఇచ్చాడు.

Also read: ఈ వారం థియేటర్స్ మూవీని మిస్ అవ్వకండి 

ఇటీవలి కాలంలో తమిళ చిత్ర పరిశ్రమకి  చెందిన  రాఘవ లారన్స్ కూడా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరికొందరు స్టార్ హీరోలు కూడా తమిళనాడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, తమిళనాట రాజకీయాలను శాసించే దిశగా అడుగులు వేస్తోందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జివి ప్రకాష్ కుమార్ తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com