Home

»

Latest News

Allu Arjun: అల్లు అర్జున్ నా క్రష్.. మీ స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి

Jun 30, 2026 5:42PM

 

ఓటీటీ రంగంలో వినూత్నమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న ఈటీవీ విన్  సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'.ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని స్కూల్ డేస్ జ్ఞాపకాలు, స్వచ్ఛమైన ప్రేమకథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సిరీస్ జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ యాంకర్ రమ్యతో ముచ్చటించింది. ముఖ్యంగా యువ హీరో విరాజ్ అశ్విన్ ఈ సిరీస్ ద్వారా తెలుగుతెరకు పరిచయమవుతున్న సరికొత్త కథానాయిక యశాశ్రీ రావు తమ అనుభవాలని పంచుకున్నారు. 

ఇంటర్వ్యూలో హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, ఈ కథ వినగానే నాకు నా పాఠశాల రోజులు గుర్తుకొచ్చాయి. చిన్ననాటి మధుర స్మృతులు, క్లాస్‌రూమ్ అల్లరి, మొదటి ప్రేమ వంటి అంశాలు 100 శాతం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. డైరెక్టర్ వినోద్ గాలి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం. ముఖ్యంగా ఎస్. సుహాస్ అందించిన 'ఈ వయసే' సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతోందని తెలిపారు. ఈ సిరీస్ కేవలం ప్రేమకథ మాత్రమే కాదని, అందులో దాగి ఉన్న కుటుంబ బంధాలు, ఎమోషన్స్ ప్రేక్షకులని  కట్టిపడేస్తాయని అన్నారు. ముఖ్యంగా సీనియర్ నటి రోహిణీ హట్టంగడి, గోపరాజు రమణ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు నటించడం వల్ల సిరీస్ స్థాయి మరింత పెరిగిందని విరాజ్ పేర్కొన్నారు.

ఈ సిరీస్ ద్వారా డెబ్యూ ఇస్తున్న యశాశ్రీ రావు మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తావన తెచ్చారు. ట్రెయిలర్‌లో అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్స్‌ని  రీక్రియేట్ చేసిన విధానం, ఆయనపై నాకు ఉన్న అభిమానాన్ని సరదాగా పంచుకున్నారు. మొదటి ఎపిసోడ్ పూర్తిగా ఉచితంగా వీక్షించే సదుపాయాన్ని ఈటీవీ విన్ కల్పించడం విశేషం. ఈ అద్భుతమైన స్కూల్ నాస్టాల్జియా సిరీస్ ఈ వారం ఓటీటీ లవర్స్‌కి  ఖచ్చితంగా ఒక మంచి విజువల్ ట్రీట్ కానుంది. జూలై 3న విడుదల కాబోతున్న ఈ సిరీస్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com