Home

»

Latest News

BharataVarsha: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'భరతవర్ష' గ్లింప్స్.. ఇది కదా గోపీచంద్ కటౌట్ కు తగ్గ సినిమా!

Apr 13, 2026

- ప్రాచీన భారతదేశ చరిత్ర నేపథ్యంలో 'భరతవర్ష'
- గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా సెన్సేషన్

మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) ఒక భారీ పీరియడ్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న 33వ చిత్రానికి 'భరతవర్ష' (BharataVarsha - Saga of Shula) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టైటిల్ గ్లింప్స్ ను పరిశీలిస్తే.. 642 AD లోని 'శూల' అనే ప్రాంత నేపథ్యంలో కథ సాగనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. వీడియో ప్రారంభంలోనే ఒక అగ్నిపర్వతం పేలుడు, నల్లటి పర్వతాల మధ్య ఉన్న ఒక గిరిజన తెగను చూపించి సంకల్ప్ రెడ్డి తన మార్క్ టేకింగ్‌ను చాటుకున్నారు. ఒక భారీ యుద్ధ సన్నివేశంతో వీరుడిలా గోపీచంద్ పాత్రను పరిచయం చేసిన తీరు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక గ్లింప్స్ చివర్లో గోపీచంద్ తన రెండు చేతుల్లో మండుతున్న కర్రలను పట్టుకుని గంభీరంగా నడుచుకుంటూ వచ్చే షాట్ హైలైట్ గా నిలిచింది.

గోపీచంద్ ఈ చిత్రం కోసం తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నారు. కండలు తిరిగిన దేహం, పొడవైన జుట్టు, గడ్డంతో ఒక పవర్ ఫుల్ యోధుడిగా కనిపిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి గత చిత్రాలు 'ఘాజీ', 'అంతరిక్షం' లాగే ఈ సినిమా కూడా ఒక విజువల్ వండర్‌గా ఉండబోతుందని గ్లింప్స్ లోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ చూస్తే అర్థమవుతోంది.

ఈ భారీ ప్రాజెక్టులో గోపీచంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు తెలియని ఒక కీలక ఘట్టాన్ని, వీరత్వాన్ని ఈ సినిమా ద్వారా వెలికి తీయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. గ్లింప్స్‌లో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చూస్తుంటే గోపీచంద్ తన కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం ఖాయమనిపిస్తోంది.

సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. "గోపీచంద్ కు సరైన డైరెక్టర్ దొరికాడు", "విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 56 సెకన్ల వీడియోతోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు సంకల్ప్ రెడ్డి. కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్.. ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com