
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఈసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.. ఏకంగా మైథలాజికల్ ఎపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కోసం డిసెంబర్ 2026 నుంచి పూర్తిస్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యస్వామి(మురుగన్) పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీఆర్‌కు వినిపించారని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం.
ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారట. మైథలాజికల్ కథను తెరకెక్కించాలంటే కథ, పాత్రల రూపకల్పనతో పాటు సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకే ముందుగానే ప్రీ-ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పనులు పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం తన లుక్‌ను మార్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2027లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్.
ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది.

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలవడం, అందులోనూ పౌరాణిక నేపథ్యంతో భారీ సినిమా చేయాలనుకోవడం ఆసక్తిని పెంచుతోంది.
మొత్తానికి, ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఆయన కెరీర్లోనే భిన్నమైన ప్రయత్నంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్లో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలైతే.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మరి మురుగన్ పాత్రలో ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ ఏ స్థాయిలో చూపించబోతున్నారు? అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: విజయ్-రష్మిక విడాకుల న్యూస్.. ఎటుపోతోంది ఈ సమాజం.!
[God Of War Pre Production Begins In December, Jr NTR God Of War, NTR Trivikram Movie, God Of War Movie Update, NTR Lord Murugan Role, NTR Dragon Movie, NTR Kumara Swamy, Trivikram Srinivas, Anirudh Ravichander, Telugu Film News]






