జెనీలియా ఆరోగ్యం ప్రమాదంలో పడిందా!
on Nov 5, 2024
బాయ్స్, సత్యం,సై, బొమ్మరిల్లు, ఆరంజ్, రెడీ, సాంబ, ఢీ,కింగ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జెనీలియా. పలు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.
జెనిలియా(genelia)ఇప్పుడు ఒక ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతుందని, క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే ఆమె శరీరంలో మార్పులు వస్తాయని,ముఖ్యంగా కూల్ వాటర్ తో పాటు కూల్ డ్రింక్స్, స్వీట్స్ తీసుకున్న వెంటనే శరీరంపై రాషెస్ కూడా వస్తాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కళ్ళతో వేటినైనా చూసినా కూడా మసక మసకగా కనిపిస్తాయంట,అందుకే ఎప్పడు వార్మ్ టెంపరేచర్ ఉన్న నీటినే తీసుకుంటుందని కూడా చెప్తున్నారు.
వ్యాధి తగ్గడానికి చాలా రోజుల నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని, కానీ ఇంతవరకు తగ్గు ముఖం పట్టకపోవడంతో జెనీలియా డిప్రెషన్ లోకి వెళ్లిందని కధనాలు కూడా వినిపిసిస్తున్నాయి.
2012 లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశముఖ్ కొడుకు రితీష్ దేశముఖ్ ని వివాహం చేసుకున్న జెనీలియా కి ఇద్దరు పిల్లలు. రితీష్ దేశముఖ్ కూడా బాలీవుడ్ సినిమా రంగంలో హీరోగా మంచి గుర్తింపు నే పొందాడు.