పోసాని కృష్ణ మురళి కి సింగపూర్ కేన్ ట్రీట్ మెంట్!
on Oct 22, 2024
దర్శకుడు గీతా కృష్ణ(geetha krishna)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.సంకీర్తన,కీచురాళ్ళు, కోకిల,ప్రియతమ,సర్వర్ సుందరం గారి అబ్బాయి,టైమ్, కాఫీ బార్ వంటి పలు వెరైటీ చిత్రాలు ఆయన నుండి వచ్చాయి. చాలా ఏళ్ళ నుంచి సినిమా రంగ విశేషాలతో పాటు రాజకీయ,సామజిక సమస్యల పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాడు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పోసాని కృష్ణ మురళి(poasani krishna murali)కి త్వరలోనే సింగపూర్ లో నేరస్థులకి ఇచ్చే కేన్ ట్రీట్ మెంట్ ని ఇస్తారు. చెండ్ర కోల లాంటి పొడవాటి కర్రతో కాళ్ళకి, మోకాళ్ళకి మధ్య భాగంలో కొడతారు.రెండు దెబ్బలకే నేరస్థుడు భయపడిపోయి కాళ్ళ బేరానికి వచ్చి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు.ప్రస్తుతం పోసాని పరారీలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడ ఉన్న కూడా పట్టుకొని కేన్ ట్రీట్ మెంట్ ఇస్తారని చెప్పుకొచ్చాడు. పోసాని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చాలా దారుణమైన విమర్శలు చేశాడు.
Also Read