
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఉరఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రిలో ఉన్న పవన్ ని ఈరోజు సాయంత్రం నిర్మాతలు కలవనున్నారు.
ఈ భేటీలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పవన్ కల్యాణ్ తో చర్చించడంతో పాటు పర్సంటేజ్ విధానంపై కూడా నిర్మాతలు చర్చించనున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీలు ఇవ్వాలని డిమాండ్ తో నిన్న హైదరాబాద్ లో చిరంజీవి(Chiranjeevi)తో సమావేశమైన సంగతి తెలిసిందే. నేడు రాజమండ్రిలో నిర్మాతలు పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరు ఎవరితో కలిసిన పెద్ది గురించి అనే విషయం తెలిసిందే
Also read: Suriya: సూర్య అప్ కమింగ్ మూవీకి షాకింగ్ బిజినెస్.. కరుప్పు హిట్ కదా!






