Home

»

Latest News

fauzi: ఫౌజీ సెట్స్‌లో మరోసారి ఘోర ప్రమాదం.. వరుస ప్రమాదాలకి ఇదే కారణమా! 

Jul 4, 2026 4:33PM

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సీతారామం ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 

ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. శుక్రవారం జూలై 3న అంటే నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియో ప్రకారం సెట్స్‌లో  ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది  . ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదరు వీడియోలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ తగలబడటంతో పొగ పైకి రావడం కనిపించింది. ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో సెట్స్‌లో టెంట్లు, షూటింగ్  కోసం తీసుకు వచ్చిన ఎక్విప్మెంట్ కొంత డ్యామేజ్ అయ్యిందని, స్వల్ప నష్టం వచ్చిందని టాక్. అయితే... ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో  సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా అనే కామెంట్స్ ని పలువురు సినీ శ్రేయోభిలాషులు చేస్తున్నారు. 


Also read: Sing Geetham: సింగ్ గీతం ఓటీటీ రిలీజ్, థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ ఉండవచ్చని టాక్. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని చెప్తున్నారు. ప్రభాస్ తో ఇమాన్వి జత కడుతుండగా పాన్ ఇండియా స్థాయిలో పేరున్న యాక్టర్స్  ఫౌజీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com