Home

»

Latest News

fahadh faasil: హీరోగా ఫాహద్ ఫాజిల్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

May 18, 2026 10:15AM

 

పార్టీ లేదా పుష్ప అంటు ఆల్ ఇండియా సినిమా ప్రేక్షకులకి తన వశం చేసుకున్న నటుడు, హీరో  ఫహద్ ఫాజిల్(fahadh faasil). లెజండ్రీ యాక్టర్ అనే టాగ్ లైన్ కూడా తనంతట తానే వచ్చి చేరింది. సెల్యులాయిడ్ పై తను యాక్ట్ చేస్తుంటే నెక్స్ట్ సీన్ లో తాను లేకపోయినా ఫాహద్ నెక్స్ట్ సీన్ లో ఏం చేస్తాడనే క్యూరియాసిటీ ఉంచడంలో కూడా తిరుగులేని నటుడు. 


రీసెంట్ గా  సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ తన కొత్త సినిమాని   అధికారికంగా ప్రారంభించారు. గతంలో తమిళంలో '96' మరియు ఇటీవల 'మెయ్యళగన్' (తెలుగులో సత్యం సుందరం) వంటి క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులని  మంత్రముగ్ధులని  చేసిన ప్రేమ్ కుమార్, ఈసారి ఫహద్ ఫాజిల్‌తో చేతులు కలపడం సినిమా ఇండస్ట్రీలో  భారీ సంచలనంగా మారింది. శనివారం చెన్నైలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మూవీ ఓపెనింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.


Also read: Atlee: ఇక మియు.. అట్లీ భావోద్వేగ పోస్ట్ 


ప్రస్తుతానికి 'ప్రొడక్షన్ నంబర్ 32' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఐశారి కె. గణేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్ తో పాటు మిగతా నటి నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఫహద్ ఫాజిల్ గతంలో పలు చిత్రాల్లో కీ రోల్స్  పోషించినప్పటికీ, స్ట్రెయిట్ తమిళ సినిమాలో సోలో హీరోగా నటించడం ఇదే మొదటిసారి. త్వరలోనే  రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఎస్సారిక (శివద) హీరోయిన్‌.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com