Home

»

Latest News

Epic Movie Review Telugu: ఎపిక్ మూవీ రివ్యూ 

Sep 11, 2026 8:55AM

 

 

-సినిమా పేరు:ఎపిక్ 
-న‌టీన‌టులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి,  కళ్యాణ్ శంకర్ తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: అజీమ్ మహమ్మద్ 
-ఎడిటింగ్: నవీన్ నూలి 
-మ్యూజిక్: హేషమ్ అబ్దుల్ వాహబ్  
-నిర్మాత‌లు: నాగ వంశీ, సాయి సౌజన్య
-బ్యానర్స్: సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
-రచన,దర్శకత్వం:ఆదిత్య హాసన్ 
-రిలీజ్ డేట్ : ఆగష్టు 11 ,2026 


బేబీ మూవీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ,  వైష్ణవి చైతన్య ఈ రోజు ఎపిక్ గా మరోసారి సెల్యులాయిడ్ ని తమ వశం చేసుకోవడానికి ఎపిక్ తో  వచ్చారు. సితార నాగవంశీ ఆ ఇద్దరితో కలవడం స్పెషల్. క్రేజ్ దృష్ట్యా నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.


కథ
ఆదిత్య ..(ఆనంద్ దేవరకొండ) తెలంగాణలోని 'వనపర్తి' టౌన్ కి చెందిన డిగ్రీ కంప్లీట్ చేసిన మధ్య తరగతి యువకుడు. బిడియం, మొహమాటస్తుడు, నెమ్మదస్తుడు. సినిమా దర్శకుడు కావాలనేది తన లక్ష్యం. కానీ తల్లితండ్రులు( శివాజీ, వాసుకి) వల్ల ఉన్నతచదువుల కోసం లండన్ వెళ్తాడు. లండన్ లో కడలి( వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. పోష్ గర్ల్. అందుకు తగ్గట్టే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటంతో పాటు శారీరకంగా చాలా సార్లు కలుస్తారు. కానీ ఎలాంటి ఎమోషన్ కనెక్ట్ ఉండకూడదనేది ఆ ఇద్దరి మధ్య ఒప్పందం. మరి ఆ ఇద్దరి ప్రయాణం చివరకి ఎలా ముగిసిందనేదే ఎపిక్.

ఎనాలసిస్ 

కాన్సెప్ట్ హిట్టుకి దారి అయినా అర్ధం పర్ధం లేని లాజిక్స్ తో సీన్స్ నింపేశారు. ఎంతలా అంటే ఆదిత్య, కడలి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియనంతలా. మొదట 20 నిముషాలు మూవీ బాగానే ఉంటుంది. కానీ రన్ అయ్యే కొద్దీ విసుగు వస్తుంది. ఆదిత్య తో కడలి శారీరక సుఖాన్ని పొందుతూనే ఇంటికి వెళ్ళాలి, అమ్మ నాన్న చెప్పిన సంబంధం చూసి ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోవాలి అంటుంది. ఏ ధైర్యంతో మేకర్స్ ఈ భావజాలాన్ని చెప్పించారో వాళ్ళకే తెలియాలి. కొంత మంది పెళ్లి కానీ అమ్మాయి, అబ్బాయిలు ఒకే ఇంట్లో, అది కూడా ఒకే గదిలో బెడ్ పై పడుకుంటున్నారు. చేతులు చేతులు కలిసినప్పుడో, వర్షం పడినప్పుడో, లేదా హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వలనో శారీరకంగా కలవడం కామన్ అని, ఆ తర్వాత ఇంట్లో పేరెంట్స్ ప్రాబ్లెమ్ గుర్తొచ్చి మన మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండింగ్  వద్దు అనుకోని ఎంటర్ టైన్ మెంట్ వే లో చెప్పినా కన్విన్స్ గా ఉండేది.

దాంతో మరి కలవకుండా ఏం చేస్తారు మీ ఇద్దరు అని ఆదిత్య, కడలి తో మనం ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళం. అలా కాకుండా వాంటెడ్ గా రొమాన్స్ చేస్తూ అర్ధం పర్థం లేని లాజిక్స్ చెప్పుకోవడం విడ్డురంగా ఉంటుంది. మూవీ మొత్తం ఒకే టెంపోలో సాగుతుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉందని విడమర్చి చెప్పుకోలేం. టోటల్ గా మూవీలో అక్కడక్కడ సీన్స్,డైలాగ్స్ పేలాయి. ముఖ్యంగా ఆదిత్య నుంచి వచ్చిన డైలాగ్స్. ఆటిట్యూడ్  బాగానే ఉంది. కాకపోతే అంత అమాయకుడు సినిమా డైరెక్షన్ ఎలా చేస్తాడో  అర్ధం కాదు.

పైగా ఫ్రెండ్స్ చెప్పే నిర్ణయాల ఆధారంగా లైఫ్ లో డెసిషన్స్ తీసుకోవడం ఎంత వరకు కరెక్టో కూడా తెలియదు. ఆ విధంగా కాకుండా తన లైఫ్ లోకి వచ్చిన కడలి లాంటి అమ్మాయి విషయంలో ఒక సినిమా కథగా రాసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాను అని తనే నిర్ణయించుకోవాల్సింది.


నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

 అమాయకత్వంతో కూడుకున్న  ఆదిత్య క్యారక్టర్ లో ఆనంద్ దేవరకొండ నాచురల్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో తన స్థానం పదిలం అని చాటేలా అన్ని వేరియేషన్స్ లో అద్భుతంగా సెట్ అయ్యాడు. కడలిగా వైష్ణవి నటన బాగున్నా, కొన్ని సీన్స్ లో ఎబ్బెట్టుగా అనిపించింది.మరి ఆ విషయంలో తన ప్రాబ్లమో , మేకర్స్ ప్రాబ్లమో తెలియదు. శివాజీ కి రెండు మూడు సీన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి నటన గురించి ఎక్కువగా చెప్పుకోలేం. మిగతా క్యారెక్టర్స్ పరిస్థితి కూడా అదే. కాకపోతే మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాత్రం ఆదిత్య ఫ్రెండ్ క్యారక్టర్ లో ఇరగదీసాడు. యాక్టర్ గా బిజీ అవ్వడం ఖాయం. ఆదిత్య హాసన్ దర్శకుడిగా టేకింగ్ బాగుంది. రచయితగా మాత్రం నూటికి నూరుపాళ్లు న్యాయం చెయ్యలేకపోయాడు. 90 's  తీసినా ఆదిత్య హాసన్ ఇప్పుడు ఎపిక్ తో వచ్చాడంటే నమ్మలేం. నవీన్ నూలి ఎడిటింగ్ థియేటర్స్ లో నుంచి మధ్యలోనే వెళ్లకుండా కాపాడింది. ఫొటోగ్రఫీ ఎక్స్ లెంట్. హేషమ్ అబ్దుల్ నుంచి వచ్చిన ఒక సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డల్. నాగ వంశీ నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
1 . ఆనంద్, వైష్ణవి పెర్ ఫార్మెన్స్ 
2 . డైరెక్షన్ 

బలహీనతలు 
1 . కథ, కథనం
2 . ప్రీ క్లైమాక్స్ 
3 . క్లైమాక్స్ 

చివరిగా చెప్పాలంటే ఓవర్ థింకింగ్ తో ఎపిక్ ని చుట్టేశారు.

రేటింగ్ 2 /5                                                                                                       అరుణాచలం 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com