తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
on May 10, 2020
మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. మొదట డబ్బింగ్ ఫిల్మ్ 'ఓకే బంగారం' ద్వారా మన ముందుకొచ్చాడు. తర్వాత 'మహానటి' మూవీలో జెమినీ గణేశన్ క్యారెక్టర్ చేయడం ద్వారా సన్నిహితుడయ్యాడు. తాజా సమాచారం ప్రకారం దుల్కర్ మరో తెలుగు సినిమాకు సంతకం చేశాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించే చిత్రంలో అతను హీరోగా నటించనున్నాడు. ఈ కాంబినేషన్ మూవీని స్వప్న సినిమా బ్యానర్ నిర్మించనున్నది. లాక్డౌన్ పీరియడ్ ముగిశాక ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలిసింది.
దుల్కర్ ఏదైనా సినిమా ఒప్పుకున్నాడంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుందనే పేరు తెచ్చుకున్నాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, పడి పడి లేచే మనసు చిత్రాలను రూపొందించిన హను చెప్పిన కథ వినగానే దుల్కర్‌కు విపరీతంగా నచ్చేసిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ మూవీలో దుల్కర్ జోడీగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరం. సౌత్‌లో అతనికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లోనూ విడుదల చేస్తారని సమాచారం.