Home

»

Latest News

తెలుగువ‌న్ రిపోర్ట‌ర్ దిల్‌రాజుని అడిగిన ప్ర‌శ్న‌.. మ‌రుస‌టి రోజే అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌.! 

Nov 14, 2026 5:23PM

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బేన‌ర్‌లో ఎన్ని సూప‌ర్‌హిట్ సినిమాలు వ‌చ్చాయో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో దిల్‌రాజు చేసిన రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2, ఎఫ్‌3, సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలు ఘ‌న విజ‌యం సాధించాయి. 2026, 2027 సంక్రాంతికి ఆయ‌న నిర్మాణంలో వ‌చ్చిన ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో 2028 సంక్రాంతి దిల్ రాజుదే అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

హిట్ కాంబినేష‌న్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు, అనిల్ రావిపూడి క‌లిసి మ‌ళ్లీ సినిమా చెయ్య‌బోతున్నార‌ని, ఆ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రారంభ‌మై 2028 సంక్రాంతికి రిలీజ్ అవుతుంద‌ని కూడా చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో దీని గురించి ప్ర‌స్తావిస్తూ తెలుగువ‌న్ ఛాన‌ల్ సినిమా ఇన్‌ఛార్జ్ వేణు బిక్కి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ దిల్‌రాజు ఏమ‌న్నారంటే.. ‘ప్రస్తుతం అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా బేనర్‌లో సినిమా చేస్తారు. హీరో ఎవరు, అది ఎలాంటి సినిమా అనేది ఇప్పుడే చెప్పలేను. అయితే వచ్చే సంక్రాంతికి ప్రారంభమై 2028 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని మాత్రం చెప్పగలను’ అన్నారు. 

అయితే అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఈ సినిమా గురించి అడిగిన మ‌రుస‌టిరోజే ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేన‌ర్‌లో ఈ సినిమా నిర్మించ‌బోతున్న‌ట్టు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌క‌టించారు. అయితే దీనికి సంబంధించి ఒక వార్త ఫిలిం స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే.. అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని దిల్‌రాజు ప్ర‌క‌టించిన మ‌రుస‌టిరోజే ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా అని ఎనౌన్స్ చేయ‌డంతో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తోపాటు దిల్ రాజు కూడా ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారా? అనే సందేహం క‌లుగుతోంది. మ‌రి దిల్‌రాజు చెప్పిన కాంబినేష‌న్ ఇదేనా?  లేక మ‌రో హీరోతో అనిల్ రావిపూడి చేసే సినిమాకు దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారా అనే విష‌యం తెలియాల్సి ఉంది. 

ఏది ఏమైనా ప్రెస్‌మీట్‌లో అనిల్ రావిపూడి సినిమా ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన మ‌రుస‌టి రోజే ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌ ఎనౌన్స్‌మెంట్ రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

 

[Dil Raju, Anil Ravipudi, Ntr, KalyanRam, NtrNewMovie] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com