Home

»

Latest News

Varanasi: వారణాసిపై నెట్ ఫ్లిక్స్ అధికారి కీలక వ్యాఖ్యలు.. భవిష్యత్తులోనే సర్ప్రైజ్

Jun 25, 2026 10:57AM

 

ఇండియన్ సినిమా గొప్పతనాన్నివరల్డ్ సినిమాకి చెప్పాలనే లక్ష్యంతో ముస్తాబు అవుతున్న మూవీ వారణాసి(Varanasi).. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టుగా ఉండటంతో   మహేష్, రాజమౌళి  ఈ సారి చాలా గట్టిగానే కొట్టబోతున్నారనే విషయం అర్ధమవుతుంది. ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ సుమారు 1,200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. డిజిటల్ రైట్స్ ని  గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్  650 కోట్ల భారీ ఆఫర్‌ని   మేకర్స్ ముందు ఉంచినట్లు టాక్ నడుస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇప్పటివరకు ఏ చిత్రానికి కూడా లభించని అత్యంత భారీ రేటు అని చెప్పవచ్చు. గతంలో రాజమౌళి(Rajamouli)రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ వైడ్‌గా సాధించిన అపారమైన వ్యూయర్ షిప్ మరియు ఆస్కార్ విజయం తెచ్చిపెట్టిన క్రేజ్ కారణంగానే, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సారి వారణాసికి 650 కోట్ల భారీ ఫిగర్ ని ఆఫర్ చేసినట్టుగా  టాక్ .

అయితే రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్  తొలి తెలుగు ఒరిజినల్ సిరిస్ సూపర్ సుబ్బు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది.  సదరు కార్యక్రమంలో నెట్ ఫ్లిక్స్ అధికారి మోనికా షెర్గిల్ కి  వారణాసి ఓటిటి డీల్ మీరే దక్కించుకున్నారు కదా అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు మోనికా చిరునవ్వు చిందిస్తూ 'కొన్ని విషయాలు భవిష్యత్తులోనే సర్ప్రైజ్ గా ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ తో పాటు  మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకూమారన్,  గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారు. ఏప్రిల్ 7, 2027 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ కానుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com