
అనుపమ పరమేశ్వరన్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'నేను గత రెండు సంవత్సరాలుగా ఒక శాడిస్ట్ బిహేవియర్ లాంటి వ్యక్తి ప్రేమ నుంచి బయటపడ్డాను. మొదట్లో శాడిస్ట్ అని తెలియకుండా బాగానే మానేజ్ చేసాడు. ఆ తర్వాత నిదానంగా తెలుసుకున్నాను. నాలాగా ఆడపిల్లలు అమాయకత్వంతో వేరే మగవాళ్ళని నమ్మి మోసపోవద్దు. ఆత్మహత్య చేసుకోవాలనుకొని కూడా విరమించుకున్నానని చెప్పి అనుపమ పెద్ద సంచలనమే సృష్టించింది.
అనుపమ ఈ వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినా, సోషల్ మీడియా నెటిజన్లు మాత్రం ఆ వ్యక్తి ధ్రువ్ విక్రమేనంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ ప్రారంభించారు. దీంతో ఈ వివాదంపై ధ్రువ్ విక్రమ్ ఏ విధంగా స్పందిస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇండియా టుడే రౌండ్ టేబుల్ వేదికగా ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ విమర్శలు, వార్తలపై తొలిసారిగా నోరు విప్పారు. "నాపై వస్తున్న పరిశీలనలు, విమర్శలు నన్ను అస్సలు ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. ఖచ్చితంగా ఇవి నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కానీ ఇటువంటి కష్టసమయాల్లో మనం దేనికి కట్టుబడి ఉన్నాం, మన అసలు గుర్తింపు ఏంటి అనేది గ్రహించి వాస్తవంలో నిలబడటం చాలా ముఖ్యం.మీరు ప్రేమిస్తున్న వ్యక్తులను, మీకు అత్యంత ముఖ్యమైన వారిని గట్టిగా కాపాడుకోవడమే మీ మొదటి ప్రాధాన్యత కావాలి. మీరు నిజం వైపు నిలబడినప్పుడు ఎలాంటి విమర్శలైనా ఒక హద్దు వరకే పనిచేస్తాయి.
Also read: అలాంటి వాళ్లే రావాలంట.. నవదీప్ వ్యాఖ్యలు వైరల్
ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు మానసికంగా ఒక సైన్యంలా మారి, మీ సొంత ప్రపంచాన్ని, అంతర్గత శాంతిని కాపాడుకోవాల్సి ఉంటుంది" అని ధ్రువ్ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో తాను పెద్దగా సక్రియంగా ఉండకపోవడానికి గల కారణాలను కూడా ఆయన వివరిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువుల వీడియోలను ఎడిట్ చేసుకోవడం మాత్రమే తనకిష్టమని, సినిమా ప్రమోషన్ల సమయంలోనే బయటకు వస్తానని చెప్పారు. తన జీవితంలో జరుగుతున్న ఈ వివాదాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చి ధ్రువ్ విక్రమ్ ఆత్మవిశ్వాసం చాటుకున్నారు. దక్షిణాది చిత్రసీమలో గత కొన్ని రోజులుగా యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ల డేటింగ్, బ్రేకప్ వార్తలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. అనుపుమ, ధ్రువ్ కలిసి గత ఏడాది వచ్చిన ‘బైసన్' మూవీలో జోడీగా నటించిన విషయం తెలిసిందే.
Anupama Parameswaran, Dhruv Vikram





