Home

»

Latest News

ఇరుముడి మణమ్మకి ధనుష్ స్పెషల్ సర్‌ప్రైజ్

Aug 25, 2026 3:47PM


'ఇరుముడి' వంద కోట్ల క్లబ్ లో చేరడంతో మాస్ మహారాజా రవితేజ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రవితేజ ఎంటైర్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అనే టాక్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. రవితేజ కుమార్తెగా మణికంఠ రోల్ లో కనిపించిన బేబీ నక్షత్రకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో నక్షత్ర కనబరిచిన పెర్ ఫార్మ్  కంటతడి పెట్టించింది. 

తాజాగా వర్సటైల్ హీరో, తమిళ స్టార్ ధనుష్ 'ఇరుముడి' సినిమాను చూసి చిన్నారి నక్షత్ర నటనకు ఫిదా అయ్యారు. ఆమె నటనకు ముగ్ధుడైన ధనుష్, చిన్నారి నక్షత్రకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ బహుమతిని పంపడమే కాకుండా, స్వయంగా ప్రశంసల వర్షం కురిపించారు. నక్షత్ర అభినయాన్ని కొనియాడుతూ "నీ దగ్గర నుంచి నటులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నీ సహజ నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని ధనుష్ వీడియో కాల్ చేసి మరి  అభినందించడం విశేషం.


Also Read: బికినీతో రాఖీ ఎందుకు కట్టారు.. ప్రముఖ హీరోయిన్ పై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు 

కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతోమంది సీనియర్ నటులు మెచ్చిన ఈ చిన్నారికి ధనుష్ వంటి జాతీయ ఉత్తమ నటుడి నుంచి ప్రశంసలు రావడం పట్ల చిత్రబృందం ఎంతో హర్షం వ్యక్తం చేస్తోంది. కేరళకి చెందిన నక్షత్ర ఇరుముడికి సంబంధించి తెలుగులో తనే డబ్బింగ్ చెప్పడం విశేషం.   

Dhanush, Irumudi, Nakshatra, Shiva Nirvana

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com