Home

»

Latest News

అయ్యప్ప గెటప్‌లో డేవిడ్ వార్నర్.. ఇరుముడి ఫీవర్

Aug 25, 2026 11:23AM

 

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బౌలర్లను తన బ్యాటింగ్‌తో భయపెట్టే ఈ దిగ్గజ క్రికెటర్, సోషల్ మీడియాలో మాత్రం పూర్తి టాలీవుడ్ మాస్ హీరోలా మారిపోతుంటాడు. పుష్ప రాజ్ తగ్గేదేలే మేనరిజం నుంచి అల్లు అర్జున్, మహేష్ బాబు పాటలకు డ్యాన్సులు వేస్తూ తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. హైదరాబాద్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని నిలుపుకుంటూ ఎప్పటికప్పుడు తెలుగు సాంప్రదాయాలు, సినిమాలపై తన ప్రేమను చాటుకునే వార్నర్, తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు.

ఇటీవల టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మరియు నెట్టింట 'ఇరుముడి' సినిమా పేరు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాల ఏఐ (AI) క్రియేటివిటీతో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ 'ఇరుముడి' ట్రెండ్‌లోకి ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఊహించని రీతిలో ఎంట్రీ ఇచ్చాడు. నల్లటి వస్త్రాలు ధరించి, మెడలో తులసి మాల వేసుకుని, శిరస్సుపై పవిత్రమైన ఇరుముడి కట్టును మోస్తూ పక్కా అయ్యప్ప స్వామి మాలాధారి గెటప్‌లో వార్నర్ దర్శనమిచ్చాడు. పూర్తి భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి రూపంలో కనిపించిన వార్నర్ పిక్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది నిజమైన ఫొటోనా లేక ఫ్యాన్స్ తయారుచేసిన ఏఐ ఎడిటింగ్ పిక్చరా అని తెలుసుకోవడానికి వేలాది మంది  ఆసక్తి చూపడంతో ఈ ఫోటో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.


Also Read: కాపీ వివాదంలో తాప్సీ గాంధారి మూవీ..  కళ్యాణ్ బండి ఎవరు

ఈ పిక్ చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మరియు తెలుగు క్రికెట్ ప్రేమికులు ఖుషీ అవుతున్నారు. "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ కామెంట్లు పెడుతూ వార్నర్ పిక్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. గతంలో నితిన్ నటించిన 'రాబిన్‌హుడ్' సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించి టాలీవుడ్ అరంగేట్రం చేసిన వార్నర్, ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక అవతారంలో మెరవడం విశేషం. 'ఇరుముడి' సినిమా హైప్‌తో పాటు వార్నర్ మాస్ ఇమేజ్ తోడవడంతో సోషల్ మీడియాలో ఈ ఇరుముడి ఫీవర్ ట్రెండింగ్ నంబర్ వన్‌గా దూసుకుపోతోంది. అసలు విషయం ఏంటంటే  వార్నర్‌ని ఊహిస్తూ అభిమానులు ఈ పోస్టర్‌  డిజైన్ చేశారు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే  డేవిడ్ వార్నర్‌ని అయ్యప్ప స్వామి పిక్  ఆకట్టుకోవడంతో స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనే  షేర్ చేశాడు.

David Warner, Irumudi, Raviteja

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com