Home

»

Latest News

Dance master: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రముఖ డాన్స్ మాస్టర్ మృతి 

Jun 23, 2026 12:21PM

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక  యువతని తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అన్నం అనిల్ ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నం అనిల్  ఈ రోజు ఉదయం తన బైక్‌పై బాన్సువాడ పట్టణం నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్నాడు. నిజామాబాద్ సమీపంలోని గాంధీ నగర్ వద్దకు చేరుకునే సరికి, ఎదురుగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ని బలంగా ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టిన వేగానికి బైక్ పూర్తిగా ధ్వంసమవగా, అనిల్ తలకి  తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే అనిల్ ప్రాణాలు విడిచాడు.

 ఊహించని  ఈ సంఘటనతో  కుటుంబ సభ్యులు, బాన్సువాడ పట్టణ ప్రజలు, కళాకారులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, అందరితో నవ్వుతూ మాట్లాడే ఒక యువ కళాకారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.అనిల్ వయస్సు కేవలం 34 ఏళ్లు. ఆయన బాన్సువాడ పట్టణంలో సుప్రసిద్ధమైన ‘నటరాజ్ డ్యాన్స్ అకాడమీ’ని నిర్వహిస్తున్నారు. ఈ అకాడమీ ద్వారా  ఎంతో మంది చిన్న పిల్లలకి, యువతీ యువకులకి డ్యాన్స్ నేర్పిస్తూ, వారిలోని కళా నైపుణ్యాలని మెరుగు పరుస్తున్నారు.  స్థానికంగా జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన కొరియోగ్రఫీ ఎంతో ప్రత్యేకంగా నిలిచేది. పోలీసులు అనిల్ మరణంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

also read: mythri movie makers: మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ.. రాజా ది రాజా రిలీజ్ ఎప్పుడంటే

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com