Home

»

Latest News

కపుల్ ఫ్రెండ్లీ ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది..హైలెట్స్ ఇవేనా! 

Feb 14, 2026 10:59AM

 

-థియేటర్స్ లో అడుగుపెట్టిన కపుల్ ఫ్రెండ్లీ 
-పక్కా రొమాంటిక్ డ్రామా
-ప్రేక్షకులు ఏం చెప్తున్నారు


వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని ఈ రోజు 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly)తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. పూర్తిగా చెన్నై సిటీలో చిత్రీకరించగా పెళ్లి కానీ యువతీ, యువకుడు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తే ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం, తదనంతరం ఆ ఇద్దరి జీవితాలు ఎలా ముగిశాయనే పాయింట్ తో తెరకెక్కింది. సదరు యువతీ యువకులైన శివ, చైత్ర క్యారెక్టర్స్ లో సంతోష్ శోభన్, మానస వారణాసి సూపర్ గా చేసారని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. మంచి మెసేజ్ కూడా ఇచ్చిందనే అభిప్రాయం వాళ్ళ దగ్గర్నుంచి వ్యక్తమవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం.


 కథ పాయింట్ చాలా బాగుంది. తనని ఇష్టపడి పెళ్లి అవ్వకుండానే తన శరీరాన్ని అర్పించిన చైత్రకి హెల్త్ బాగోకపోతే శివ నిలబడిన తీరు హాట్స్ హాఫ్. శివ మంచి కోసం ఆలోచించిన చైత్ర క్యారక్టర్ డిజైన్ కూడా మెప్పించింది. లివింగ్ రిలేషన్ లో ఉండే వాళ్ళల్లో భావోద్వేగాలు ఉంటాయని, వాళ్ళని చెడు ఆలోచనలతో చూడకూడదనే పాయింట్ ని కూడా చెప్పారు.మూవీ మొత్తానికి ఇవే ప్రధాన హైలెట్స్  అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. 

 

Also read:  Couple Friendly: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ

టాక్ పరంగా చూసుకుంటే మెజారిటీ ప్రేక్షకులు పర్వాలేదని చెప్తున్నారు.రివ్యూస్ కూడా నాట్ బాడ్ అని చెప్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో అజయ్ కుమార్ రాజు నిర్మించిన కపుల్ ఫ్రెండ్లీ కి  అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు.రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. ఆదిత్య రవీంద్రన్  మ్యూజిక్.

 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com