'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!
on Feb 15, 2026

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly) సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.1.89 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు. రెండోరోజు ఆదివారం కావడంతో పాటు శివరాత్రి కలిసి రావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశముంది.
'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



