Home

»

Latest News

కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

Oct 8, 2026 2:12PM


హిట్ ని  కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మార్చుకున్న 'శ్రీవిష్ణు' మళ్ళీ సెల్యులాయిడ్ పై నవ్వుల జడివాన సృష్టించడానికి రేపు 'కామ్రేడ్ కల్యాణ్' తో అడుగుపెట్టనున్నాడు. ఈ రోజు కొన్ని ఏరియాస్ లో ప్రీమియర్స్ కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రాన్ని వీక్షించి ఫస్ట్ రివ్యూతో పాటు సెన్సార్ సర్టిఫికేట్‌ని జారీ చేసింది. సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులని  ఏ మేరకు అలరిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.


 సెన్సార్ బోర్డ్ అధికారులు ఈ చిత్రానికి క్లీన్ 'UA 16+' సర్టిఫికేట్‌ కేటాయించారు. కథాకథనాలు, ఎమోషనల్ సీన్లు డిమాండ్ చేసిన నిడివితో సినిమా రన్‌టైమ్‌ను సరిగ్గా 2 గంటల 25 నిమిషాలు (సుమారు 145 నిమిషాలు)గా లాక్ చేశారు. సినిమా రన్ టైమ్ విషయంలో సెన్సార్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.  సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్, సుదర్శన్ వంటి ప్రముఖ కామెడీ నటులు అందించిన వినోదం, శ్రీవిష్ణు మార్క్ పంచ్ డైలాగ్స్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని సెన్సార్ టాక్ వెల్లడిస్తోంది. 

ఇది కూడా చదవండి: Nana Patekar: నానాపటేకర్ చివరి కోరిక ఇదే: ఆ కోరిక తీరుస్తున్న ముఖ్యమంత్రి!

 


నక్సలిజం అండ్ యాక్షన్ అంశాలు ఉన్నప్పటికీ, సీరియస్‌గా కాకుండా ఎంటర్‌టైనింగ్ అండ్ ఎమోషనల్ టచ్‌తో సినిమా సాగుతుందట. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు 145 నిమిషాల పాటు పరిపూర్ణ వినోదాన్ని అందిస్తుందని సెన్సార్ రివ్యూ స్పష్టం చేస్తోంది.

 

[Comrade Kalyan First Review, Sree Vishnu Comrade Kalyan Movie Review, Comrade Kalyan Censor Report, Comrade Kalyan Movie Story,Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com