Home

»

Latest News

కామ్రేడ్ కళ్యాణ్‌పై మెగా అభిమానుల గుర్రు: ఆచార్యపై సెటైర్ అవసరమా.?

Oct 9, 2026 4:10PM

మెగా అభిమానులకు ‘ఆచార్య’ సినిమా మిగిల్చిన నిరాశ అంతా ఇంతా కాదు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా ఫలితం నుంచి బయటపడటానికి అభిమానులకు చాలా కాలమే పట్టింది. ఇప్పుడు మెగా కుటుంబానికి చెందిన నటీనటులు వరుస విజయాలతో ముందుకు సాగుతున్న సమయంలో.. శ్రీ విష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’లో ఆచార్య ప్రస్తావన చర్చకు దారితీస్తోంది.

శ్రీ విష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’లో కామెడీ కోసం పలు పాపులర్ సినిమాల రిఫరెన్స్‌లను ఉపయోగించారు. అందులో భాగంగా.. ‘‘నీది ఏ దళం అంటే.. నాది ఆచార్య దళం’’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో పాటు.. ఆ దళం ఎక్కడ ఉంటుందని అడిగితే "ధర్మస్థలికి, పాదఘట్టానికి మధ్యలో ఉంటుంది" అని చెబుతాడు.

సినిమాల్లో ఇతర చిత్రాలపై సరదాగా సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. సందర్భానికి తగ్గట్టుగా రాస్తే ఇలాంటి డైలాగ్స్‌ ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే ‘ఆచార్య’ విషయంలో మెగా అభిమానుల భావోద్వేగాలు కాస్త భిన్నం. తండ్రీకొడుకులు కలిసి నటించిన సినిమా కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం నిరాశపరచడంతో ఆ సినిమా ఇప్పటికీ ట్రోల్స్‌కు టార్గెట్‌ అవుతూనే ఉంది.

ఇలాంటి నేపథ్యంలో మరో సినిమాలో ‘ఆచార్య’ పేరును కామెడీ కోసం ఉపయోగించడంపై కొందరు మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తమ సినిమాలతో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న సమయంలో.. పాత గాయాన్ని మళ్లీ గుర్తు చేయడం ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్‌ మూవీ రివ్యూ

 

 

 

[Comrade Kalyan Acharya Dialogue, Comrade Kalyan Movie, Acharya Movie, Sree Vishnu, Chiranjeevi, Ram Charan, Mega Fans, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com