
ఇళయ దళపతి విజయ్ కి తెలుగు నాట కూడా సుదీర్ఘ కాలం నుంచే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఎప్పుడు ప్రత్యేకంగా పర్యటించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోవడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
చెన్నైలోని తన క్యాంపు కార్యాలయం నుండి మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరిన ఆయన, చెన్నై విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:00 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించిన తరువాత, రోడ్డు మార్గంలో విజయవాడ కనకదుర్గ ఆలయానికి చేరుకుని అమ్మవారిని ప్రత్యేకంగా పూజించారు.
ఇది కూడా చదవండి: సెన్సార్ బోర్డుతో క్రియేటివిటీకి సంకెళ్లు: 35 ఏళ్ళ నాటి పాత చట్టాలు మారేదెప్పుడు!

ఈ సందర్భంగా ఆలయ అధికారులు సకల మర్యాదలతో విజయ్ ని ఆహ్వానించడంతో పాటు .తీర్ధ ప్రసాదాలు అందించారు. శాలువాతో సత్కరించడంతో పాటు అమ్మవారి చిత్ర పటాన్ని కూడా బహుకరించడం జరిగింది.
[Cm Vijay vijayawada Durgamma Temple visit, Tamil Nadu CM Vijay, Vijayawada Visit, Kanaka Durga Temple, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






