Home

»

Latest News

Peddi: పెద్ది వివాదంపై రంగంలోకి చిరంజీవి.. ఎగ్జిబిటర్లతో సమావేశంలో జరగబోయేది ఇదేనా! 

May 25, 2026 9:09AM

 

'పెద్ది'(Peddi)నుంచే మాకు పర్సెంటేజ్(రెవెన్యూ షేరింగ్) సిస్టంని అందుబాటులోకి తీసుకురావాల్సిందే, లేదంటే ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో పెద్ది రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్  సినీ ప్రేమికుల్లో టెన్షన్ మొదలయ్యింది. 


ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సమస్యని  పరిష్కరించడానికి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు సాయంత్రం చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ తో మీటింగ్ జరగనుంది. ఎగ్జిబిటర్స్ వాదన ప్రకారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 120 కి పైగా థియేటర్ల యజమానులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్సెంటేజ్ సిస్టమ్ నడుస్తుంటే, ఇక్కడ మాత్రం ఇంకా పాత రెంట్ల పద్ధతిని కొనసాగించడం అన్యాయమనేది వారి వాదన. ఈ పరిస్థితుల్లో చిరంజీవి స్వయంగా ఎగ్జిబిటర్ల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుండటం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన కొడుకు రామ్ చరణ్ సినిమా విడుదల కానుండటం, అలాగే పరిశ్రమ సంక్షేమం దృష్ట్యా చిరంజీవి ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని చిరు  భావిస్తున్నారు. 

మరోవైపు, టికెట్ ధరల పెంపుదలపై కూడా తెలంగాణ ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే టికెట్ ధరలు పెంచవద్దంటూ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి  లేఖలు రాశారు. ఒకవేళ టికెట్ల రేట్లు విపరీతంగా పెంచితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, దీనివల్ల తమకు వచ్చే అరకొర కలెక్షన్లలో మళ్లీ నిర్మాతలకు అదనపు వాటాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. మల్టీప్లెక్స్ చైన్లకు ఇస్తున్నట్లే తమకు కూడా కలెక్షన్ల ఆధారంగా పర్సెంటేజ్ షేరింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. థియేటర్ల ఏసీలు, సౌండ్ సిస్టమ్స్ ఆధారంగా కాకుండా వచ్చే కలెక్షన్లను బట్టి మాత్రమే గ్రేడింగ్ చేయాలనేది ఎగ్జిబిటర్ల ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లన్నింటినీ చిరంజీవి నేతృత్వంలో జరిగే సమావేశంలో ఎగ్జిబిటర్లు ఆయన ముందు ఉంచబోతున్నారు


ఈ వివాదంపై నిర్మాత డి. సురేష్ బాబు ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఒక లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' సినిమాకు టికెట్ రేట్లు పెంచితే నెట్ కలెక్షన్లపై 7.5 శాతం అదనపు వాటా నిర్మాతలకు ఇవ్వాలని, అలాగే ప్రీమియర్ షోల విషయంలో 'ఎ' సెంటర్లలో 25,000 రూపాయలు, 'బి' సెంటర్లలో 15,000 రూపాయలు, 'సి' సెంటర్లలో 5,000 రూపాయలు చొప్పున చెల్లించేలా సబ్ కమిటీ ఒక ఫార్ములాను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అయితే, ఛాంబర్ ప్రతిపాదించిన ఈ 'రేట్ల పెంపు - అదనపు పర్సెంటేజ్' ఫార్ములాను తెలంగాణ ఎగ్జిబిటర్లు పూర్తిగా తిరస్కరించారు. ఛాంబర్ చెబుతున్నవన్నీ ఏకపక్ష నిర్ణయాలని, కొందరు నిర్మాతల ప్రయోజనాల కోసమే గ్రౌండ్ లెవెల్ ఎగ్జిబిటర్లను బలి చేస్తున్నారని మండిపడ్డారు. 

Also read: Peddi: 24 గంటల్లో హెల్లాల్లల్లో సాంగ్ వ్యూస్ రికార్డు ఇదే.. మరి థియేటర్స్ లో ఎలా ఉంటుందో 

 సునీల్ నారంగ్ స్థానంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జువ్వాడి శేఖర్ రావు నేతృత్వంలో ఎగ్జిబిటర్లు తమ పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో   చిరంజీవి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మీటింగ్ అత్యంత కీలకంగా మారింది. టాలీవుడ్ పెద్ద దిక్కుగా పిలవబడుతున్న చిరంజీవి  ఎగ్జిబిటర్లు కి, నిర్మాతలకి   వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపుతారో అని పరిశ్రమ వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com