Home

»

Latest News

తను మాట్లాడదు.. మాట్లాడలేదు: చిరు నోటి నుంచి బయటపడ్డ అసలు సీక్రెట్.!

Nov 18, 2026 3:35PM

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా ఈవెంట్‌కు వెళ్లినా అక్కడ ఏదో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడటం కామన్ అయిపోయింది. తన సినిమాలకు సంబంధించిన విషయాలను సరదాగా లీక్ చేస్తూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతుంటారు. అందుకే ఆయన చెప్పే విషయాలకు ‘చిరు లీక్స్’ అనే పేరు కూడా వచ్చేసింది. 

తాజాగా మరోసారి ‘కాకా’ సినిమా నుంచి ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి. ఈసారి అనస్వర రాజన్ పాత్ర గురించి ఆయన ఇచ్చిన హింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె చాలా అద్భుతంగా నటించిందని, ముఖ్యంగా ఆమె చిరునవ్వులో అమాయకత్వం, స్వచ్ఛత కనిపిస్తాయని చెప్పారు.

ఇదే సమయంలో ‘కాకా’ సినిమాలో అనస్వర పాత్ర గురించి చెప్పాలని ప్రేక్షకులు అడగడంతో చిరంజీవి మొదట ఏమీ చెప్పనని అన్నారు. కానీ ఆ తర్వాత ఆమెను ఉద్దేశించి.. “అనస్వర.. నువ్వేమైనా నీ పాత్ర గురించి మాట్లాడతావా? తను మాట్లాడదు.. మాట్లాడలేదు. నేను చెప్పిన ఈ చిన్న మాటను ఇంటికి వెళ్లాక గుర్తుచేసుకుని ఆలోచించండి. అప్పుడు అసలు విషయం మీకే అర్థమవుతుంది” అంటూ నవ్వేశారు.

ఇది కూడా చదవండి: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు.!

చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ‘కాకా’ సినిమాలో అనస్వర రాజన్ మూగ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఆమె ఈ సినిమాలో చిరంజీవి కూతురు ‘అమ్ములు పాప’గా నటిస్తున్నట్లు ప్రచార చిత్రాల ద్వారా వెల్లడైంది. ఇప్పుడు చిరు ఇచ్చిన హింట్‌తో ఆమె పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది. 

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’లో చిరంజీవి, అనస్వర రాజన్ మధ్య తండ్రీకూతుళ్ల అనుబంధం కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

మీకు నచ్చవచ్చు: 
RC17 హీరోయిన్ సర్‌ప్రైజ్.. ఐదుగురికి లుక్ టెస్ట్.!
ఉపాసన ఎమోషనల్.. ఆ సమయంలో రామ్ చరణ్.!

 

 

 

[Kaaka Movie, Chiru Leaks, Anaswara Rajan, Chiranjeevi, Bobby Kolli]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com