Home

»

Latest News

సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్

Sep 2, 2026 10:57AM

 

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే.  

'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్‌ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు.


ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది.

 

 

Chiranjeevi, Pawann Kalyan, Pawan Birthday Wishes, Sankalpa Saadhakudu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Panjaa

 

     

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com