Home

»

Latest News

ప్యారడైజ్ రిజల్ట్ పైనే చిరు మూవీ భవిష్యత్తు: ఎందుకు, ఏమిటి,ఎలా!

Sep 16, 2026 9:58AM

సెల్యులాయిడ్ పై ఇంకా అడుగుపెట్టకముందే నాని 'ది ప్యారడైజ్' హంగామా ఒక రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. ఫ్యాన్స్ అయితే మా నానిలో దాగి ఉన్న మాస్ విశ్వరూపం అంటే ఏంటో చూస్తారు, రికార్డ్స్ అన్ని నాచురల్ గా క్యూ కట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ విషయాన్ని అలా ఉంచితే  ప్యారడైజ్ కి మెగాస్టార్ చిరంజీవి మూవీతో లింక్ ఉందా అనే న్యూస్ తాజాగా వైరల్ హోదాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్యారడైజ్ సెట్స్ పై ఉన్నప్పుడే  లాస్ట్ ఇయర్  డిసెంబర్‌లోనే చిరు,శ్రీకాంత్ కాంబినేషన్‌లో ఒక భారీ బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ కాంబినేషన్ అనౌన్స్ కాగానే మెగా అభిమానుల్లోనూ, సినీ ప్రియుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ఈ సినిమా అసలు సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే డౌట్ కూడా ఆకాశాన్ని తాకిన అంచనాలతో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాయి. చిత్ర పరిశ్రమ తీరే అది.  కానీ ఇప్పుడు  'ప్యారడైజ్'  విజయంపైనే చిరుతో శ్రీకాంత్ మూవీ ఆధారపడి ఉందనే వార్తలు  సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే విజయమే అన్నిటిని పర్ఫెక్ట్ గా   సెట్ చేసుకుంటూ వెళ్తుంది. లేదంటే మీకు మీరే మాకు మేమే.. ఏది ఏమైనా  శ్రీకాంత్ ఓదెల, చిరు మూవీ జరగాలని కోరుకుందాం. అనౌన్స్ మెంట్ టైంలో వచ్చిన పోస్టర్ అయితే ఒక రేంజ్ లోనే ఉంది. నానినే నిర్మాత కావడం గమనార్హం.

 

 

Also Read: బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ అప్ డేట్: అభిమానుల ఆందోళన వెనక అసలు నిజం!

ప్రస్తుతం చిరు, దర్శకుడు బాబీతో చేస్తున్న కాకతో బిజీగా ఉన్నాడు. కొత్త ప్రాజెక్ట్ మాత్రం ఇంకా ఏది అనౌన్స్ చెయ్యలేదు. విశ్వంభర కూడా సంక్రాంతికి కర్చీఫ్ వేసిందనే న్యూస్ రెండు రోజులుగా సినీ,సోషల్ మీడియాలో టాప్ చైర్ లో కూర్చుంది. 

 

[Chiranjeevi, Nani, The Paradise, Kaaka, Srikanth Odela, Kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com