Home

»

Latest News

తండ్రి కొడుకుల అరుదైన రికార్డు.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ 

Jun 15, 2026 6:13PM

 

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన అరుదైన స్టార్స్.. ఇప్పుడు ఈ ఇద్దరు  ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో, ఒకే ఏడాదిలో  బాక్సాఫీస్ వద్ద   సరికొత్త రికార్డుని సృష్టించారు.

  గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి  మన శంకర వర ప్రసాద్ గారు' తో 300 కోట్లకి పైగా గ్రాస్ సాధించి  బాక్సాఫీస్‌ వద్ద నా చిరునామాకి ఎలాంటి డోకా లేదని నిరూపించాడు. చిరు క్రియేట్ చేసిన ఈ రేంజ్ కలెక్షన్స్ మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి ట్రేడ్ వర్గాలకు చూపెట్టాయి. తండ్రి సృష్టించిన ఈ భారీ రికార్డుని  అందుకుంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ జాతరని  సృష్టించాడు. పెద్ది ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ దాటి 400 కోట్ల మార్క్ కి అతి చేరువలో ఉంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దక్షిణాది చిత్రంగా కూడా సరికొత్త ఘనత సాధించింది.

Also read: vijay antony: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన విజయ్ ఆంటోని.. ఎందుకో తెలిస్తే మీరు సైతం ఎమోషనల్ 


ఈ విధంగా  ఒకే క్యాలెండర్ ఇయర్ లో తండ్రి, కొడుకు ఇద్దరూ 300 కోట్ల క్లబ్‌లో చేరి ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు అధ్యాయాన్ని లిఖించారు. 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com