
ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ అందుకున్న చిరంజీవి(chiranjeevi)మళ్ళీ అదే ఆనవాయితీనీ కంటిన్యూ చేయాలనే పట్టుదలతో దర్శకుడు బాబీతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ప్రేక్షకుల స్థాయి రోజురోజుకి పాన్ ఇండియా కథల వైపు మళ్ళుతూ ఉండటం, చిరు, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య లాంటి హిట్ మూవీ వచ్చి ఉండటంతో సదరు కాంబోలో వచ్చే మూవీపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో పండుగ సీజన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల ఘర్షణ, రికార్డుల గలాటా గుర్తుకొస్తుంది. అందునా సంక్రాంతి పండుగ బరిలో దిగడం అనేది స్టార్ హీరోలకు, నిర్మాతలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశం. ప్రతి ఏటా సంక్రాంతి కానుకగా కనీసం మూడు నుంచి నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి కోట్లాది రూపాయల కలెక్షన్లు రాబట్టడం టాలీవుడ్‌లో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే సంక్రాంతి రేసు నుంచి చిరు, బాబీ మూవీ తప్పుకోబోతోందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.ఒకేసారి పలువురు బగ్ర హీరోల చిత్రాలు పండుగ బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల కేటాయింపులో తీవ్ర పోటీ నెలకొంటోంది. ఒక్కో సినిమాకు కేవలం 30% నుంచి 40% స్క్రీన్లు మాత్రమే దక్కడం వల్ల ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, లాంగ్ రన్‌లో రావాల్సిన దాదాపు 100% రెవెన్యూ షేర్ దెబ్బతింటోందని ట్రేడ్ విశ్లేషకులు గణిస్తున్నారు. గత సంక్రాంతికి విడుదలైన భారీ చిత్రాల గ్రాస్ లెక్కలను పరిశీలిస్తే, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు 50% పైగా స్ప్లిట్ అవ్వడం వల్ల నిర్మాతలు ఆశించినంత లాభాలు పొందలేకపోయారనే టాక్ వినిపించింది.
Also read: చెన్నై లవ్ స్టోరీకి ఆ విషయంలో అన్యాయం జరుగుతుందా.. ఎన్న నడక్క పొగుదు!
ఈ పరిస్థితుల నేపధ్యంలోనే పండుగ క్లాష్ వద్దనుకుని సమ్మర్ లేదా దసరా రేసులో సోలోగా రావడం మెగా ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రయోజనకరమని మేకర్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్ రేసు నుంచి తప్పుకోవడం వల్ల అభిమానులకు కొంత నిరాశ ఎదురైనప్పటికీ, సరైన సమయానికి అత్యుత్తమ క్వాలిటీతో, సోలో రన్ థియేట్రికల్ అడ్వాంటేజ్‌తో థియేటర్లలోకి రావడం వల్ల సినిమా సులభంగా 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ అధికారికంగా సంక్రాంతి రేసు నుంచి మెగాస్టార్ తప్పుకుంటే ఇది టాలీవుడ్ స్టార్ హీరోల విడుదల వ్యూహాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 200 నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న మెగాస్టార్ చిత్రాన్ని ఎలాంటి కాంపిటీషన్ లేని సమయంలో సోలోగా బరిలోకి దింపితేనే 100% థియేటర్లు లభించి, గరిష్ఠ స్థాయి కలెక్షన్లు రాబట్టవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. అంతేకాకుండా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కొంత ఆలస్యం కావడం కూడా ఈ నిర్ణయానికి ఒక ప్రధాన కారణమని టాక్. వాల్తేరు వీరయ్య' 2023 సంక్రాంతికి వచ్చి సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.
chiranjeevi, bobby, mega 158






