Home

»

Latest News

చిరంజీవి, బాలకృష్ణ మధ్యలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? 

Sep 29, 2026 5:41PM


మీరు చూస్తున్న పిక్ లో మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మధ్య క్యూట్ గా ముద్దులొలుకుతూ ఉన్న పాప ఎవరో గెస్ చెయ్యండి. తన భర్త ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కూడా. ఏంటి.. గెస్ చెయ్యలేకపోతున్నారా! సరే ఎవరో పూర్తి న్యూస్  చదివేయండి

చిరంజీవి, బాలకృష్ణ మధ్య అత్యంత ఆత్మీయంగా నిలబడిన ఆ చిన్నారి మరెవరో కాదు, తెలుగు చిత్రసీమలో దాదాపు 5 దశాబ్దాలుగా ఎన్నో సంచలన విజయాలని అందిస్తూ వస్తున్న  ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత, శతచిత్ర నిర్మాత సి. అశ్విని దత్ ముద్దుల కుమార్తె ప్రియాంక దత్!   ఏంటి తనా అనుకుంటున్నారా! అక్షరాలా తనే. చిన్నప్పటి నుంచే ఇంట్లోనూ, షూటింగ్ సెట్లలోనూ నిరంతరం సినీ వాతావరణం, స్టార్ హీరోల సాన్నిహిత్యం మధ్య పెరిగిన ప్రియాంక దత్, పెద్దయ్యాక తన తండ్రి అడుగుజాడల్లోనే సినీ నిర్మాణ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారు. కేవలం అశ్విని దత్ గారి అమ్మాయి అనే టాగ్ లైన్‌కే పరిమితం కాకుండా, సొంత ప్రతిభతో అగ్ర నిర్మాతగా తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.

తన ప్రయాణంలో త్రీ ఏంజిల్స్ స్టూడియో బ్యానర్‌ను స్థాపించి చిన్న సినిమాలకు పెద్ద పీట వేశారు ప్రియాంక. యంగ్ హీరో నారా రోహిత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'బాణం' సినిమాతో నిర్మాతిగా మొదటి అడుగు పడింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రానికి గాను ఆమె ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'వెండి నంది పురస్కారాన్ని' అందుకోవడం విశేషం. ఆ తర్వాత 'ఓం శాంతి', 'సారొచ్చారు' చిత్రాలను నిర్మించడమే కాకుండా పవన్‌కళ్యాణ్ 'బాలు', చిరంజీవి 'జై చిరంజీవ' వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తదనంతరం తన సోదరి స్వప్న దత్‌తో కలసి వైజయంతీ మూవీస్ బ్యానర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లారు.


ఇది కూడా చదవండి: ఓటీటీలో రచ్చలేపుతున్న మలయాళ సైకో థ్రిల్లర్: ఆ...సుఖాన్ని ఎలా తీర్చుకుంటారో తెలుసా!

 

 

ప్రియాంక దత్ నిర్మించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం', మహానటి సావిత్రి బయోపిక్‌గా వచ్చిన 'మహానటి' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్లుగా నిలిచి జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టాయి. ఆమె ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను వివాహం చేసుకున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం 'కల్కి 2898 AD' చిత్రాన్ని కూడా స్వప్న దత్, ప్రియాంక దత్ కలసి అపారమైన సాహసంతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో ఏకంగా1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ చిత్రసీమలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ 'కల్కి 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉండగా, ప్రియాంక దత్ క్రేజీ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. చిన్ననాడు చిరు, బాలయ్యల మధ్య ముద్దులొలికిన ఆ పాప, నేడు వెయ్యి కోట్ల గ్లోబల్ వండర్‌ను నిర్మించే స్థాయికి చేరడం నిజంగా విశేషం! మరి చిరంజీవి, బాలకృష్ణ..మల్టిస్టారర్ ని కూడా ప్రియాంక దత్ నే నిర్మిస్తుందేమో చూడాలి. మల్టి స్టారర్ కి ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

[Chiranjeevi And Balakrishna rare photo In Priyanka Dutt, Priyanka Dutt Childhood Pic, Nag Ashwin wife Priyanka, Nag Ashwin wife Priyanka, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com