Home

»

Latest News

Akhanda 2: రిలీజ్ కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

Dec 09, 2025

 

 

 

 

-ఇక బాలయ్య జాతర స్టార్ట్ 
-కోర్టు గ్రీన్ సిగ్నల్ 
-కాసేపట్లో నిర్మాతల మీడియా సమావేశం 

 

 

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)అభిమానులకి, మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. అఖండ 2 కి ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. డిసెంబర్ 5 న విడుదల కాకుండా అఖండ 2 పై స్టే ఇచ్చిన చెన్నై హైకోర్టు రీసెంట్ గా అఖండ 2 కి సంబంధించిన తీర్పుని వెల్లడి చేసింది.

 

 

కేసుని పరిశీలించిన పిదప అఖండ 2 పై  ఉన్న కేసు కొట్టివేస్తూ రిలీజ్ కి అనుమతి ఇస్తు తన తీర్పుని వెల్లడి చేసింది. దీంతో అడ్డంకులు తొలిగిపోవడంతో  నిర్మాతలు కాసేపట్లో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ నెల 12 న విడుదల కాబోతునట్టుగా టాక్. మరి   11 నుంచే ప్రీమియర్ షోస్ తో అభిమానుల జాగరణ ప్రారంభం కావడం ఖాయం.

   

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com