Home

»

Latest News

Britney Spears: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. లెజండ్రీ సింగర్ కి జైలు శిక్ష  

May 12, 2026 11:24AM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan Kalyan)జల్సా మూవీలో తన ప్రేయసిని ఉద్దేశించి 'బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears)కి ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ సుందరి' అని అంటాడు. బ్రిట్నీ స్పియర్స్ ఎవరో కాదు  పాప్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన లెజండ్రీ అమెరికన్ సింగర్. రీసెంట్ గా బ్రిట్నీ స్పియర్స్ కి కోర్టు షాక్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాం

మార్చి నెలలో దక్షిణ కాలిఫోర్నియాలో  బ్రిట్నీ స్పియర్స్ పై డ్రంక్ డ్రైవ్ కేసు నమోదయ్యింది. పైగా  లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన లాస్ ఏంజిల్స్ కోర్టు తన తీర్పులో' చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఒక రోజు జైలు శిక్ష మరియు జరిమానా మూడు నెలల పాటు ప్రభుత్వం నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి వారం థెరపీ సెక్షన్లకి అటెండ్ కావడంతో పాటు నెలకి రెండు సార్లు సైక్రియాట్రిస్ట్ ని కలవాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.


Also read: Varanasi: ఇక నో హాలిడేస్.. రాజమౌళి బ్రాండ్ షురూ 

ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు అయినా చట్టం ముందు అందరూ సమానమే అని ఈ ఘటన నిరూపిస్తుంది. బ్రిట్నీ స్పియర్స్ గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడింది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com