Home

»

Latest News

Blast Zone Movie Review In Telugu: బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

May 28, 2026 1:54PM

 

సినిమా పేరు: బ్లాస్ట్ జోన్
న‌టీన‌టులు: అర్జున్ సర్జా, ప్రీతి ముఖుంధన్, అభిరామి,జాన్ కొక్కెన్, వివేక్ ప్రసన్న,అర్జున్ చిదంబరం, పవన్ కృష్ణా  త‌దిత‌రులు 
సినిమాటోగ్ర‌ఫీ: అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్
మ్యూజిక్:రవి బస్రూర్
నిర్మాత‌: కల్పతి ఎస్. అఘోరం
బ్యానర్:ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన,దర్శకత్వం: :సుభాష్ కె. రాజ్
రిలీజ్ డేట్ : మే 28 , 2026 

యాక్షన్ కింగ్ అర్జున్, కన్నప్ప మూవీ ఫేమ్ ప్రీతి ముఖుంధన్, సీనియర్ నటి అభిరామి కలిసి ఈ రోజు బ్లాస్ట్ జోన్ అనే వినూత్నమైన టైటిల్ తో కూడిన చిత్రంతో థియేటర్స్ లో అడుగుపెట్టారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్లాస్ట్ జోన్ ని నిర్మించడం స్పెషాలిటీ.  మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
రాజారామన్( అర్జున్ సర్జా), నీలవేణి(అభిరామి) మధ్య తరగతికి చెందిన  భార్యా భర్తలు. నీల(ప్రీతి ముఖుంధన్) ఆ ఇద్దరి కూతురు.. ఆ ముగ్గురు మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతులతో పాటు ఎంతో దైర్యం గల వ్యక్తులు. వరుణ్ దయాలన్(జాన్ కొక్కెన్) బడా మిలినియర్. అధికార పార్టీకి చెందిన మంత్రితో కలిసి ఒక ఊరిని నాశనం చెయ్యాలని చూస్తుంటాడు. అబ్రహం(అర్జున్ చిదంబరం) కొన్ని వందల మందిని చంపిన  కరుడుగట్టిన నేరస్థుడు. కృప(పవన్ కృష్ణా) లోకల్ రౌడీ. తన తమ్ముడితో కలిసి ఎన్నో హత్యలుచేసిన వ్యక్తి. ఈ అన్ని క్యారెక్టర్స్ మధ్య ఏం జరిగిందనేదే బ్లాస్ట్ జోన్ .

ఎనాలసిస్ 

కథ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టదు. పైగా కథ పాయింట్ మనల్ని ఆలోచింపచెయ్యడంతో పాటు ఆడవాళ్లు దైర్యంగా పోరాడాలని చెప్పినట్టుగా కూడా అయ్యింది. కానీ కొన్ని లాజిక్ లేని సీన్స్ రావడంతో పాటు భావోద్వేగం అనేది మిస్ అయ్యింది. ఈ విషయంలో కథకి కీలక పాయింట్ అయిన  కీలకాడు గ్రామంలోని క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేస్తూ రాజారామన్, నీలవేణి, నీలని సెకండ్ హాఫ్  లో కీలకాడు  పంపించాల్సింది. తద్వారా కొత్త స్టఫ్ దొరికేది.

ఫర్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే నీల చిన్నతనంలో వచ్చిన సీన్స్ తో బ్లాస్ట్ జోన్  డిజపాయింట్ చేయదని అనిపిస్తుంది. అందుకు తగ్గట్టే ప్రతి సీన్స్ ఎంతో ఉత్కంఠతతతో సాగుతుంది. నీలతో యాక్షన్ సీక్వెన్స్ , వరుణ్ ఇంట్రడక్షన్, అతని లక్ష్యం సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా అబ్రహం యాక్షన్ ఎపిసోడ్ అయితే మరో లెవల్. సిన్సియర్  పోలీస్ ఆఫీసర్ అరుణగిరి, అబ్రహం మధ్య వచ్చిన హాస్పిటల్ ఎపిసోడ్ కూడా మెస్మరైజ్ చేసింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. సెకండ్ హాఫ్ చూసుకుంటే నీల, రాజారామన్, నీలవేణి ల నిర్ణయం మనకి దృశ్యం మూవీని తలపిస్తుంది. అందుకే కీలకాడు అనే ఊరిని ఒక సాంగ్ లో చూపించకుండా కథనాన్ని ఆ ఊరిలో కూడా నడిపించాల్సింది. యాక్షన్ సీక్వెన్స్, పకడ్బందీ స్క్రీన్ ప్లే మెప్పించాయి. క్లైమాక్స్ విషయంలో హై డ్రామాని నడిపించాల్సింది. సినిమా మొత్తం హై డ్రామా నడిపించి ఒక బడా మిలినియర్ ని సింపుల్ గా ఇంటికి వెళ్లి చంపడం అనేదే బాగోలేదు.

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు 


అర్జున్ తన స్క్రీన్ ప్రెజెన్స్, స్టంట్ సీక్వెన్స్ తో అద్భుతమైన పెర్ఫార్మ్ ఇవ్వడంతో పాటు .  మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న క్యారక్టర్ కి తను తప్ప మరొకరు సూట్ అయ్యేవారు కాదనేలా మెప్పించాడు. నీల గా ప్రీతీ ముకుందన్ పెర్ఫార్మ్ బ్లాస్ట్ జోన్ కి అతిపెద్ద ప్లస్ గా నిలిచింది. ఎంత అందంగా ఉందో అంతే అందంగా యాక్షన్ సీక్వెన్స్ లో రఫ్ ఆడించింది. హోమ్లీ లుక్ లో కూడా అంతే. అభిరామి కూడా సేమ్. హోమ్లీ లేడీగా, మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన వ్యక్తిలా సూపర్ గా చేసింది. నెగిటివ్ రోల్స్ లో చేసిన జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, పవన్ కృష్ణా  తమ పవర్ ఫుల్ పెర్ఫార్మ్ తో మెప్పించారు. ముఖ్యంగా అర్జున్ చిదంబరం రాబోయే రోజుల్లో పవర్ ఫుల్ స్టైలిస్ట్ విలన్ గా మరిన్ని సినిమాల్లో అవకాశాలు సంపాదించడం ఖాయం.  సుభాష్ కె. రాజ్ దర్శకుడిగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. కానీ రచయితగా మరింత శ్రద్ద చూపించాల్సింది. రవి బసూర్ నుంచి సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరికొత్తగా ఉండి బ్లాస్ట్ జోన్ కి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

బలాలు
1 . కథ పాయింట్ 
2 . అర్జున్, ప్రీతీ, అభిరామి క్యారెక్టర్స్ డిజైన్ 
3 .ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్ 
4 .యాక్షన్ ఎపిసోడ్స్ 
5 . దర్శకత్వం 
6 . ఫొటోగ్రఫీ 
7 . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 
8 . ఫస్ట్ ఆఫ్ 

బలహీనతలు 
1 . సెకండ్ ఆఫ్ లోని  కొన్ని సీన్స్ 
2 . క్లైమాక్స్ 

ఫైనల్ గా చెప్పాలంటే ఎక్కడా బోర్ కొట్టకుండా మెప్పించడం బ్లాస్ట్ జోన్ స్పెషాలిటీ.

 

 


రేటింగ్ 2 .5 /5                                                                             అరుణాచలం 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com