ENGLISH | TELUGU  

Exclusive.. 'NBK 109' గురించి దిమ్మతిరిగే న్యూస్...

on Nov 13, 2024

సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యంకాని విధంగా, వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). బాలయ్య తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'NBK 109' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ వినిపిస్తున్నాయి.

'NBK 109' సినిమాకి 'డాకు మహారాజ్' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. నవంబర్ 15న టీజర్ తో ఈ టైటిల్ ని అఫీషియల్ గా రివీల్ చేయబోతున్నారు మేకర్స్. గతంలో ఈ సినిమాకి 'వీరమాస్' అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత  'డాకు మహారాజ్', 'సర్కార్‌ సీతారామ్‌' టైటిల్స్ ప్రముఖంగా వినిపించాయి. అయితే వీటిలో 'డాకు మహారాజ్'కే చిత్ర బృందం ఓటేసినట్లు సమాచారం. (NBK 109 Title Teaser)

'డాకు మహారాజ్' అనే టైటిల్ ఎంత కొత్తగా, పవర్ ఫుల్ గా ఉందో.. సినిమా కూడా అంతే కొత్తగా, పవర్ ఫుల్ గా ఉంటుందట. దర్శకుడు బాబీ డిఫరెంట్ స్టోరీ మరియు స్టైలిష్ మేకింగ్ తో అందరినీ సర్ ప్రైజ్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో బాలయ్యని మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడట బాబీ. 

'డాకు మహారాజ్'లోని బాలయ్య డిఫరెంట్ లుక్స్ బిగ్ స్క్రీన్ పై ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టైటిల్-టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఆ విషయం అర్థమైంది. ఆ పోస్టర్ లో బాలయ్య ఫేస్ ని పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, విభిన్న గెటప్ లో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇక టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి అంటున్నారు. టీజర్ కట్ అదిరిపోయిందట. బాలకృష్ణ లుక్స్, విజువల్స్, మ్యూజిక్ ప్రతిదీ ఒక ట్రీట్ లా ఉంటుందట. సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాతో, బాలయ్య తన విజయపరంపరను కొనసాగించడం ఖాయమని ఇండస్ట్రీలో వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.