Home

»

Latest News

Bhagyashri borse: ఎమోషనల్ అయిన  భాగ్యశ్రీ బోర్సే.. కమల్ హాసన్ కి ప్రామిస్ చేసేసింది

May 27, 2026 11:55AM

 

హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా భాగ్యశ్రీ బోర్సే తన మార్క్ చూపించేందుకు సిద్ధమైంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సేయాన్'  లో భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి విశ్వ కధానాయకుడు కమల్ హాసన్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు

రీసెంట్ గా  భాగ్యశ్రీ బోర్సే కమల్ హాసన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. కమల్ తో పలు విషయాలు చర్చించిన తర్వాత ఆమె సోషల్ మీడియా వేదికగా కమల్‌తో దిగిన పిక్స్ ని షేర్ చెయ్యడంతో పాటు ఒక ఎమోషనల్ ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ లో 'ప్రియమైన కమల్ హాసన్ సర్, చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను.ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి మీ సినిమాలో చేస్తుంది. మీరు నా భుజాలపై చేతులు వేసి ఆశీర్వదించి, ఆల్ ది బెస్ట్ చెప్పిన క్షణంలో ఆనందంతో గంతులు వేసింది. మీ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మిమ్మల్ని, మీ నమ్మకాన్ని గర్వపడేలా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను" అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించి, నేడు భారత చలనచిత్ర రంగానికి మార్గదర్శకుడైన కమల్ హాసన్ ప్రొడక్షన్‌లో అవకాశం దక్కించుకోవడం, ఆయన నుండే నేరుగా ప్రశంసలు అందుకోవడం భాగ్యశ్రీ బోర్సే  సినీ ప్రయాణంలో అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు ,పోస్ట్ నెట్టింట  హల్‌చల్ చేస్తున్నాయి. 

Also read: Trisha: నేను బ్లాక్ డ్రెస్ ధరిస్తే జరిగేది ఇదే...త్రిష ఆసక్తికర ట్వీట్   

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 2026 అక్టోబర్‌లో థియేటర్లలోకి రానుంది.మే 6, 2026 న భాగ్యశ్రీ  పుట్టినరోజు  సందర్భంగా 'సేయాన్' చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అధికారికంగా విడుదల చేసింది. చేతిలో నెమలి ఈకని  పట్టుకుని ప్రశాంతమైన వదనంతో ఉన్న ఆమె లుక్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. శివకుమార్ మురుగేషన్ దర్శకుడు.   

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com