
నటుడుగా, నిర్మాతగా బండ్ల గణేష్ సృష్టించిన 'ఆరా'కి ఘనమైన హిస్టరీనే ఉంది. ముఖ్యంగా నిర్మాతగా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనే టాగ్ లైన్ ని ట్రాక్ రికార్డు ఆధారంగానే సంపాదించాడు. రీసెంట్ గా బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
సదరు పోస్ట్ లో 'దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరును వాడి, నా జీవితానికి అన్యాయం చేయవద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఎలాంటి పదవుల మీద కానీ, అధికార హోదాల మీద కానీ ఎలాంటి వ్యామోహం లేదు. అంతేకాకుండా, జీవితంలో మరే ఇతర విషయాలపైనా ప్రత్యేకమైన ఆశలు లేవని స్పష్టం చేస్తూ, లేనిపోని విషయాలు తన చుట్టూ అల్లి మాట్లాడటం వల్ల తన వ్యక్తిగత జీవితానికి, ప్రశాంతతకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి: జాసన్ సెకండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవే: ఆ తెలుగు అగ్ర హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా!

ఇటీవలే బండ్ల గణేశ్ 'బీజీ బ్లాక్ బస్టర్స్' అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించి, సినీ పరిశ్రమలోకి నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే యువ హీరో అక్కినేని నాగచైతన్యను కలిసి, "ఒక్క సినిమా ఇవ్వండి బాబు, బ్లాక్‌బస్టర్ తీసి చూపిస్తా" అని కోరడం, దానికి చైతూ సైతం సానుకూలంగా స్పందించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ తరుణంలో, ఆయన పేరుపై వస్తున్న కొన్ని రూమర్లు తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది.
[Bandla Ganesh Recent Emotional Post, Bandla Ganesh, Bandla Ganesh Latest Post, Bandla Ganesh Viral News, Tollywood Producer Bandla Ganesh, Telugu Cinema News, Telugu cinema, Tollywood News, Tollywood]






