Home

»

Latest News

Bandla Ganesh: బండ్ల గణేష్‌ని చెప్పుతో కొట్టిన టాలీవుడ్ ప్రముఖుడు.. ఫ్యాన్స్ షాక్ 

May 25, 2026 10:28AM


ప్రేక్షకులకి, అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు బండ్ల గణేష్(Bandla Ganesh). ఒక రకంగా సదరు పేరు బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మరి కామెడీ నటుడిగా కెరీర్ ని ప్రారంభించి అగ్ర నిర్మాతగా ఎదిగి, తన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే చిరంజీవి తో సహా సినిమా ఇండస్ట్రీని తన ఇంటికి పిలిపించుకుంటున్నాడంటే సామాన్యమైన విషయం కాదు కదా. బండ్ల గణేష్ రీసెంట్ గా నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఒక సంచలన విషయాన్నీ చెప్పాడు. దీంతో సదరు  వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

బండ్ల గణేష్ మాట్లాడుతు స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజే నా జీవితంలో ఒక చేదు సంఘటన జరిగింది. ఆ రోజుల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో, సినిమా పెద్దలని  కలిసి మాట్లాడేందుకు వెళ్తుండే వాడిని. ఒకరోజు షూటింగ్ స్పాట్‌లో నేను మరో నటుడితో కలిసి ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ పెద్దమనిషి పక్కన కూర్చున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో పెద్దలని ఎంతో గౌరవంగా “సార్.. సార్..” అని పిలుస్తుంటారు. నేను కూడా అలాగే ఎంతో వినయంగా మాట్లాడుతుండగా ఊహించని విధంగా  ఒక్కసారిగా చెప్పు తీసుకుని నన్ను కొట్టారు ఆయన మంచి వ్యక్తే.. నాకు సహాయం కూడా చేశారు. కానీ ఆ రోజు ఏ మూడ్‌లో ఉన్నారో తెలియదు. నేను ‘సార్.. సార్..’ అని పిలుస్తుండగా చెప్పుతో కొట్టాడు. ఆ క్షణం నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను” . షూటింగ్ స్పాట్‌లో అందరి ముందూ జరిగిన ఆ  ఘోర అవమానంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవ్వడంతో పాటు  కళ్లలో నీళ్లతో వెంటనే అక్కడి నుంచి బయటకి వచ్చేసాను. అయితే ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. నేను బలహీనుడిని కాబట్టే నన్ను అలా అవమానించారనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నాతో ఉన్న వ్యక్తితో ఒక మాట చెప్పాను. ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు అని. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది.

Also read: kamakshi bhaskarla: శృంగారం బూతులా ఎందుకు చూస్తారు.. కామాక్షి బాసర్ల సంచలన వ్యాఖ్యలు 


అయితే, ఆ తర్వాత రోజుల్లో తాను స్టార్ ప్రొడ్యూసర్ అయి వందల కోట్ల టర్నోవర్ కళ్లచూసినా, తనను కొట్టిన వ్యక్తిపై ఎలాంటి కక్ష లేదా ద్వేషాన్ని పెంచుకోలేదు. ఆ వ్యక్తి మంచివాడే.  సౌందర్య మరణ వార్త విన్న మానసిక ఆందోళన, ఒత్తిడి వల్లే అలా ప్రవర్తించి ఉంటారని బండ్ల గణేష్ సమర్థించారు. అంతేకాకుండా, ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే ఆ పెద్దమనిషి తనకు ఫోన్ చేసి క్షమాపణలు కూడా చెప్పారని రివీల్ చేశారు. ఆ అవమానాన్ని తాను ఒక గొప్ప జీవిత పాఠంగా భావించానని, అదే తనను మానసికంగా మరింత బలంగా మార్చి, జీవితంలో వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగేలా చేసిందని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఎవరు అనే అంశంపై పెద్ద చర్చ మొదలైంది. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com