Home

»

Latest News

ఇద్దరిలో గెలవబోతుంది ఎవరో తెలిసిపోయింది: ఎందుకంటే ఆ సీక్రెట్ బయటకొచ్చింది! 

Sep 8, 2026 7:09PM

 

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. కింగ్ నాగార్జున.. తెలుగు సినీ సీమలో ఈ ఇద్దరు చూడని విజయం, సృష్టించని రికార్డు లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు క్రిస్ మస్ కి వెల్ కమ్ చెప్తూ    తమ అప్ కమింగ్ సినిమాలతో డిసెంబర్ 24 న రాబోతుండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బాలకృష్ణ మూవీ నేమ్  'దాదా’ కాగా నాగార్జున మూవీ నేమ్  లాటరీ కింగ్.(వర్కింగ్ టైటిల్) దీంతో ఈ రెండిటిలో ఏ చిత్రం విజేతగా నిలుస్తుందనే క్యూరియాసిటీ కొందరిలో ఉంది. 


దాదా మూవీ బాలకృష్ణ, దర్శకుడు  గోపీచంద్ మలినేని కాంబోలో  'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వస్తుంది. దీంతో ఆ ఇద్దరు ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని .వీరసింహారెడ్డి' ని మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలని  ఒక్కసారిగా పెంచేసింది. 1990ల ముంబై బ్యాక్‌డ్రాప్ మరియు ప్రాచీన చారిత్రక అంశాలతో దాదాపు రెండు వేర్వేరు టైమ్‌లైన్లలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం.  బాలయ్య మార్క్ రౌద్రం, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. పైగా వృద్ధి సినిమాస్ పతాకంపై పెద్ది మూవీ ఫేమ్ వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు.

 

 

Also Read: రవితేజ రెమ్యునరేషన్ ఎంత: లాభాల్లో మాస్ మహారాజా కొట్టిన జాక్‌పాట్!


మరోవైపు అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన 100వ మైలురాయి చిత్రం ‘కింగ్100’ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు .నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రిలీజ్  చేసిన గ్లింప్స్‌కి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి ఫుల్ క్లౌడ్ రెస్పాన్స్ వస్తు ఉంది. 'ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు... డబ్బు లేనప్పుడు లూజర్ అన్నారు, ఉన్నప్పుడు కింగ్ అన్నారు" అంటూ నాగార్జున చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, విజువల్స్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. నాగార్జున క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. పైగా 100 వ మూవీ అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉంటాడో చెప్పక్కర్లేదు. ఇక తెలుగు సినిమా తో పాటు తెలుగు సినిమా మైండ్ లో దాగి ఉన్న సీక్రెట్ ఒకటి బయటపడింది. అదేంటంటే రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయని.

 

[Balakrishna, Nagarjuna, Dada, King100, Clash, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News] 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com