Home

»

Latest News

Balakrishna: మెగా హీరో సెట్ లో బాలయ్య సందడి.. స్పెషల్ ఇదే 

Jul 8, 2026 4:02PM

 

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna),సుప్రీం హీరో సాయి దుర్గతేజ్(sai Durgha Tej)‌.. ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో చేస్తే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి.. సూపర్ గా ఉంటుందని అంటారు కదు. అది జరగాలని కోరుకుంటూ ఈ ఇద్దరికి సంబంధించిన ఆసక్తి కర న్యూస్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉంది.  


టాలీవుడ్‌లో నందమూరి, మెగా కుటుంబాల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై బాక్సాఫీస్ వద్ద ఈ రెండు కుటుంబాల హీరోల సినిమాలు పోటీ పడుతున్నప్పటికీ, బయట మాత్రం ఎంతో ఆప్యాయంగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ అభిమానులని  అలరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఒక అద్భుతమైన, అందమైన దృశ్యం హైదరాబాద్‌లోని ఒకే షూటింగ్ లొకేషన్ పరిసరాల్లో ఆవిష్కృతమైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ.. మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్‌కు ఎవరూ ఊహించని విధంగా ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ అరుదైన కలయిక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ టాపిక్‌గా నిలిచింది. అభిమానులు ఈ వార్తను తెగ షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.


 గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబోలో తెరక్కెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్  'NBK111' షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. అదే సమయంలో, ఈ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కనే మెగా హీరో సాయి దుర్గ తేజ్ చేస్తున్న 'సంబరాల యేటి గట్టు'  షూటింగ్ కూడా జరుగుతోందనే విషయం బాలకృష్ణకి తెలిసింది. తన పక్కనే మెగా హీరో షూటింగ్ జరుగుతోందని తెలియగానే బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన షూటింగ్ విరామ సమయంలో తానే స్వయంగా నడుచుకుంటూ పక్కనే ఉన్న 'సంబరాల యేటి గట్టు' సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ అలా అకస్మాత్తుగా తమ సెట్స్‌లోకి అడుగుపెట్టడాన్ని చూసి హీరో సాయి దుర్గ తేజ్ తో పాటు చిత్ర దర్శకుడు రోహిత్ కేపీ, నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కి  గురయ్యారు. సెట్స్‌లోకి రాగానే బాలకృష్ణ ఎంతో ఆప్యాయంగా సాయి దుర్గ తేజ్‌ని దగ్గరకి  తీసుకుని పలకరించారు. ఆయన చూపించిన చొరవ, ఆత్మీయత చూసి మెగా హీరో ఎంతో మురిసిపోయారు. ఇద్దరు హీరోలు కలిసి కాసేపు ఎంతో సరదాగా ముచ్చటించారు. సినిమా విశేషాలను, షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. బాలయ్య బాబు లాంటి సీనియర్ స్టార్ హీరో తమ సెట్స్‌కు రావడం చిత్ర యూనిట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.


also read: kriti sanon: అత‌డు స్టార్ న‌టుడు అనుకోలేదు.. మహేష్ బాబుపై కృతి సనన్ కామెంట్స్!

అనంతరం చిత్ర దర్శకుడు రోహిత్ కేపీ, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలతో బాలకృష్ణ కాసేపు ప్రత్యేకంగా సమయం గడిపారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ అద్భుతంగా డిజైన్ చేసిన భారీ పీరియాడిక్ గ్రామీణ సెట్స్‌ను బాలయ్య బాబు స్వయంగా ఆసక్తిగా తిరిగి పరిశీలించారు. 'హనుమాన్' వంటి గ్లోబల్ హిట్ అందించిన నిర్మాతలు ఈ సినిమా కోసం ఏమాత్రం రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారని  మనస్ఫూర్తిగా ప్రశంసించారు. గతంలో సాయి దుర్గ తేజ్ నుంచి వచ్చిన ఇంటిలిజెంట్ మూవీ టైంలో బాలకృష్ణ నే ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 

balakrishna, saidharam tej

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com