
నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. బాలకృష్ణ తనయుడి తొలి సినిమా కావడంతో.. కథ నుంచి క్యాస్టింగ్ వరకు ప్రతి అంశంపైనా ఆసక్తి నెలకొంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ విషయంలో ఆసక్తికరమైన పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రవీనా టాండన్, శోభన, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి.
మోక్షజ్ఞను వశిష్ట సాధారణ మాస్ సినిమాతో పరిచయం చేయకుండా.. సోషియో ఫాంటసీ, టైమ్ ట్రావెల్, పునర్జన్మ వంటి అంశాలతో కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ కాన్వాస్ ఉన్న ఈ కథలో పలువురు ప్రముఖ నటీనటులు భాగం కాబోతున్నారట.
ముఖ్యంగా బాలకృష్ణ హీరోయిన్లు రవీనా టాండన్, శోభన పేర్లు ఆసక్తిని పెంచుతున్నాయి. బాలకృష్ణతో గతంలో రవీనా టాండన్ ‘బంగారు బుల్లోడు’లో నటించారు. మరోవైపు శోభన కూడా బాలకృష్ణతో ‘నారీ నారీ నడుమ మురారి’లో కలిసి నటించారు. ఇప్పుడు వీరు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కీలక పాత్రల్లో కనిపిస్తారట. రవీనా టాండన్ ది నెగెటివ్ రోల్ కాగా, శోభనది మోక్షజ్ఞ తల్లి పాత్ర అంటున్నారు.
ఇక హీరోయిన్‌గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీలను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు పలు కథనాలు వచ్చాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’లో కలిసి నటించిన శ్రీలీల.. ఇప్పుడు ఆయన తనయుడు మోక్షజ్ఞతో జోడీ కడితే ఈ కాంబినేషన్‌పై సహజంగానే మంచి క్రేజ్ ఏర్పడుతుంది. నందమూరి అభిమానుల్లో కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తి కనిపిస్తోంది.
మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపిస్తారనే వార్తలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ ఉంటుందని, మోక్షజ్ఞ తండ్రి పాత్రలో కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: బాబోయ్ శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ కోసం ఇండియా టాప్ డైరెక్టర్‌కి నో చెప్పాడు.!
[Mokshagna Debut Movie, Nandamuri Balakrishna, Nandamuri Mokshagna, Raveena Tandon, Shobana, Sreeleela, Telugu Film News]






