
గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna)దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న nbk111 షూటింగ్ కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతుంది. అందులో భాగంగా బాలకృష్ణ, మంచు మనోజ్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా బాలకృష్ణ కాలు జారీ పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయ్యింది
దీంతో షూటింగ్ ని నిలిపివేయగా బాలకృష్ణ కాకినాడ పోర్టులోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలకృష్ణ గాయం విషయం నిమిషాల్లోనే వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అభిమానులు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. బాలయ్య గాయాలపై గోపీచంద్ మలినేని స్పందిస్తూ కాకినాడలో జరుగుతున్న షూటింగ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది.
Also read: కిరణ్ అబ్బవరం కోసం చిరంజీవి.. ఫ్యాన్స్ కి పూనకాలే
అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని ట్వీట్ లో తెలిపాడు. నందమూరి కళ్యాణ్ కూడా రామ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ బాబాయ్ త్వరగా కోలుకోవాలని తెలిపాడు
balakrishna, gopichand malineni, nbk111, kalyan ram





