TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

బాలకృష్ణ 'సీయం' అని పిలిచేది ఎవరినో తెలుసా?

Jun 10, 2020 4:59PM

సీయం... అంటే చీఫ్ మినిస్టర్! తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ కి వైయస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్లు. అయితే, బాలకృష్ణకు సీయం ఉన్నారు. ఇంతకీ బాలకృష్ణ దృష్టిలో సీయం అంటే ఏంటో తెలుసా? 'క్లాస్ మనవడు'. సి ఫర్ క్లాస్... యం ఫర్ మనవడు అన్నమాట. ఇంతకీ ఆ క్లాస్ మనవడు ఎవరో తెలుసా? దేవాన్ష్.

నారా చంద్రబాబు నాయుడి ముద్దుల మనవడు... బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి-నారా లోకేష్ దంపతుల కుమారుడు దేవాన్ష్. ఆ చిన్నారికి బాలయ్య క్లాస్ మనవడు అని పేరు పెట్టారు. రెండో కుమార్తె తనయుడు ఆర్యవీర్ కి 'ఎంఎం' అని అని పేరు పెట్టారు. ఎంఎం అంటే 'మాస్ మనవడు' అన్నమాట. మన వాళ్ళు ఇద్దరితో కలిసి తను చాలా అల్లరి చేస్తానని బాలకృష్ణ చెప్పారు. పెద్ద మనవడు తనను అను అల్లరి తాత అంటుంటాడనీ, చిన్న మనవడు మాత్రం 'బాలా' అంటుంటాడనీ నందమూరి నటసింహం చెప్పారు. పెద్దమ్మాయి బ్రాహ్మణి ఉన్నప్పుడు మాత్రం మనవాళ్లతో కలిసి అల్లరి చేయననీ... కనుచూపు మేరలో బ్రాహ్మణి కనిపించడం లేదని తెలిస్తే అల్లరే అల్లరి చేస్తానని ఆయన తెలిపారు.

google-ad-img