ENGLISH | TELUGU  

ఊహించని దర్శకుడుతో బాలయ్య మూవీ

on Feb 11, 2026

 

 

జోరు పెంచిన బాలయ్య 
ఆ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా!
మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్లాన్ 
ఫ్యాన్స్ ఏమంటున్నారు

 

ఆఫ్టర్ అఖండ 2(Akhanda 2)గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ 'బాలకృష్ణ'(Balakrishna)తన అప్ కమింగ్ సినిమాల విషయంలో జోరుని పెంచారు. జోరుని పెంచడమే కాదు సదరు చిత్రాల కాంబో ద్వారా ఇప్పట్నుంచే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కూడా పెంచుతున్నారు. వీరసింహరెడ్డి ఫేమ్ గోపించంద్ మలినేని(Gopichand Malineni)దర్శకత్వంలో బాలయ్య ఆల్రెడీ కమిట్ అయిన విషయం తెలిసిందే. నెక్స్ట్ మంత్ మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుండగా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే సబ్జెట్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత  తన నెక్స్ట్ మూవీ ఎవరు ఊహించని విధంగా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్(Harish Shankar)తో చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. దీంతో సినీ సర్కిల్స్ తో పాటు అభిమానుల్లో సదరు కాంబో సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో వివేక్ ఆత్రేయ(Vivek athreya)వచ్చినట్టుగా టాక్. 


వివేక్ ఆత్రేయ.. మెంటల్ మదిలో అనే మూవీతో తెరంగ్రేటమ్ చేసిన ఈ దర్శకుడు తొలి చిత్రంతోనే తనకంటు ఒక దర్శక శైలిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ తర్వాత  బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెట్స్ ని సెల్యులాయిడ్ పైకి తీసుకొచ్చి హిట్ ని అందుకున్నాడు. ఇప్పడు ఈ దర్శకుడు చెప్పిన కథ బాలయ్య కి నచ్చిందని  దీంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. వార్తలు రావడమే కాదు గోపించంద్ మలినేని సినిమా సెట్స్ పై ఉండగానే వివేక్ ఆత్రేయ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలయ్యని వివేక్ ఆత్రేయ ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. వివేక్ తన మొదటి మూడు చిత్రాల్లో  ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా వైవిధ్యంగా తెరకెక్కించాడు. కానీ సరిపోదా శనివారంలో  మాత్రం ఒక రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ని చూపించాడు.నాచురల్ స్టార్ నానికి కూడా సరికొత్త మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్ర విజయంలో ప్రధాన భూమిక ని పోషించాయి. 

 

Also read:  రూల్ ఏదైనా డోంట్ కేర్.. నేషనల్ లెవల్లో అల్లు అర్జున్ నామ స్మరణ

 

మరి ఈ లెక్కన  బాలయ్య గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి మాస్ ఎలిమెంట్స్ ని ఏ స్థాయిలో డిజైన్ చేస్తాడో చెప్పక్కర్లేదు. దీంతో అభిమానుల్లో క్రేజీ కాంబో గా మారింది. అభిమానులు అయితే అప్పుడే సరిపోదా శనివారం సినిమాలో నాని బదులు బాలకృష్ణ ని ఉహించుకుంటున్నారు. వివేక్ ఒక వేళ బిఫోర్ సరిపోదా శనివారం సినిమాల జోనర్ లో బాలయ్య తో చేసాడనే అనుకుందాం. తగ్గేదెలే అనే విధంగా తన క్యారక్టర్ లో లీనమయ్యేలా చెయ్యడం బాలయ్య యాక్టింగ్ స్పెషాలిటీ. ఏది ఏమైనా ఇది నిజంగా ఊహించని కాంబినేషన్. అతి త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్టుగా తెలుస్తుంది  బాలయ్య కి వీరసింహారెడ్డి ని అందించిన మైత్రి మూవీ మూవీ మేకర్స్ బాలయ్య కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ మూవీ ఉంటుందనేది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.