Home

»

Latest News

ఒకరి మరణం: ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు అరెస్ట్

Sep 1, 2026 2:44PM

 


ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు సందీప్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ రోజు  తెల్లవారుజామున గచ్చిబౌలి ఓఆర్ ఆర్ నుంచి ఖాజాగూడ వైపు వస్తున్న ఒక ఇన్నోవా కారు ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవా కారు డ్రైవర్ గాయపడిన వ్యక్తిని తన చేతుల మీదుగా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు.

 సందీప్  కాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వైపు వెళ్తున్నాడు.ఆ క్రమంలోనే సందీప్ కారు ఆ ఇద్దరి వ్యక్తులని  ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడగా గాయాలపాలైన వ్యక్తి మాత్రం చనిపోయాడు. ఘటనా సమయంలో  సందీప్ సందీప్ కారు నడిపినట్టుగా తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సిసి టివి ఫుటేజ్  ఆధారంగా పోలీసులు సందీప్ ని మరింతగా విచారిస్తున్నారు. సందీప్ తల్లి ప్రముఖ నటి వాసుకి. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ కి సోదరురాలిగా చేసింది. రీసెంట్ గా ఘట్టమనేని జై కృష్ణ శ్రీనివాస మంగాపురంలో చేసి మెప్పించింది.    ఆనంద సాయి అయితే  పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ తో పాటు చిన్న నాటి స్నేహితుడు.  తెలుగు చిత్ర సీమలో ఎన్నో హిట్ సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసాడు. ప్రీవియస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్.

Also read: ఇది కిక్ అంటే: సంక్రాంతి బరిలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి 

 

[Anand Sai, Pawan kalyan, vasuki, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com