Home

»

Latest News

కుర్రాళ్ల కొత్త క్రష్..జైలర్ 2 ని కాపాడబోతుందా..అసలు ఎవరీ భామ!

Oct 10, 2026 12:26PM

 

కొంత మంది భామలు అంతే.. పేరుకే  సెల్యులాయిడ్ పై అడుగుపెడతారు. కానీ   అభిమానులు, ప్రేక్షకుల హార్ట్ బీట్ పెంచేసి తన గురించే ఆలోచించేలా చేస్తారు. పైగా సినిమా రిలీజ్ కాకుండానే ట్రైలర్ తోనే ఆ అభిమాన పరిస్థితి ఏర్పడిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి భామనే అపేక్షా పోర్వాల్.

కొన్ని రోజుల క్రితం రిలీజైన ‘జైలర్ 2’ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్ వంటి హేమాహేమీలైన అగ్ర నటీనటులు నటిస్తున్నప్పటికీ, ట్రైలర్‌లో కొన్ని సెకన్ల పాటు కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన భామ 'అపేక్షా పోర్వాల్' .  ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చేతిలో గన్ పట్టుకుని, కత్తి తిప్పుతూ స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అని కుర్రాళ్ళు నెట్టింట తెగ వెతుకుతున్నారు.మోడలింగ్ రంగం నుంచి నటన వైపు అడుగుపెట్టింది. 

అపేక్షా పోర్వాల్ నేపథ్యం చూస్తే ఆమె కేవలం గ్లామర్ తార మాత్రమే కాదు, అసాధారణ ప్రతిభ ఉన్న నటిగా కనిపిస్తుంది. ఆమె ప్రతిష్టాత్మకమైన 2015 ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో పాటు, 2017లో జరిగిన ‘మిస్ దివా’ పోటీలలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. మోడలింగ్ రంగంలో రాణిస్తూనే నటనపై ఉన్న మక్కువతో ముంబైలో యాక్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా, నీరజ్ కబీ, అతుల్ మోంగియా వంటి ప్రముఖ యాక్టింగ్ టీచర్ల దగ్గర కూడా నటనలో మెలకువలు నేర్చుకుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా ‘అన్‌డైయింగ్ ఫ్లేమ్’ వంటి నాటకాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అపేక్షా, డిజిటల్ మరియు టెలివిజన్ రంగాల్లోనూ పలు ప్రాజెక్ట్‌లు చేసింది.


ఇది కూడా చదవండి: నానా పటేకర్ భార్య కీలక నిర్ణయం: సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్!

 

 

దర్శకుడు నెల్సన్ క్రియేట్ చేసిన యాక్షన్ ప్రపంచంలో అపేక్షా పోర్వాల్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. తెరపై ఆమె చేసిన స్టంట్స్ ఎంతో సహజంగా రావడానికి అసలు కారణం ఆమెకు మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న పట్టు. అపేక్షా ప్రొఫెషనల్‌గా కిక్‌బాక్సింగ్, నన్‌చక్స్ వంటి కఠినమైన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ అయిన కట్క్ నృత్యంలోనూ అపారమైన అనుభవం ఉంది. ఈ ఫిజికల్ ట్రైనింగ్ మరియు డాన్స్ నేపథ్యమే జైలర్ 2 ట్రైలర్‌లో ఆమె చేసిన ఫైట్ సీన్స్‌కు ప్రాణం పోశాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న స్పందనపై అపేక్షా స్పందిస్తూ.. “ఇది అంతటా వైరల్ అవుతోంది, మరి జైలర్ 2 ట్రైలర్‌లో నన్ను గుర్తుపట్టారా?” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా పోస్ట్ షేర్ చేసి అభిమానులను అలరించింది. అక్టోబర్ 15 న జైలర్ 2 లో ముత్తు వేల్ పాండియన్  (రజిని కాంత్) ని తన పోరాటాలతో కాపాడుతుందేమో చూడాలి.

 

[Apeksha Porwal In Jailer 2, Apeksha Porwal, Jailer 2 trailer, Rajinikanth Jailer 2, Apeksha Porwal action scenes, Jailer 2 cast, mystery girl in Jailer 2, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com